Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 22 May 2022 18:09:24 IST

కొత్త సినిమాను ప్రకటించిన Pa Ranjith.. ఫస్ట్‌లుక్ విడుదల..

twitter-iconwatsapp-iconfb-icon

కోలీవుడ్‌లో విలక్షణ సినిమాలు తెరకెక్కించే దర్శకుడు పా. రంజిత్ (Pa Ranjith). ‘మద్రాస్’(Madras), ‘కబాలి’(Kabali) , ‘కాలా’ (Kaala) వంటి సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్నాడు. అతడి నుంచి ఈ మధ్యే వచ్చిన చిత్రం ‘సార్‌పట్ట’ (Sarpatta). ఆర్య హీరోగా స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా అభిమానుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఈ చిత్రం ఇచ్చిన కిక్‌తో ‘నచ్చతిరం నగర్గిరతు’ (Natchathiram Nagargirathu) రొమాంటిక్ ప్రాజెక్టును తెరకెక్కించాడు. ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా తర్వాత పా.రంజిత్ తన తర్వాతి చిత్రాన్ని చియాన్ విక్రమ్‌తో చేయనున్నాడు. విక్రమ్ 61వ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. 


ప్రస్తుతం పా. రంజిత్ ప్రతిష్ఠాత్మక ‘కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌’లో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో ‘వెట్టువం’(Vettuvam) అనే కొత్త సినిమాను ప్రకటించాడు. ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశాడు. గ్రామీణ నేపథ్యంలోని గ్యాంగ్‌స్టర్ కథతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. శత్రువుల నుంచి తప్పించుకోవడానికీ హీరో పోలీసులకు లొంగిపోతాడు. పోలీసులకు లొంగిపోయిన తర్వాత అతడి పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. అన్యాయనికీ వ్యతిరేకంగా హీరో ఏ విధంగా పోరాడాడనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ‘వెట్టువం’ షూటింగ్ జులై‌లో ప్రారంభం కాబోతుంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. గోల్డన్ రేషియో ఫిలింస్‌తో కలసి నీలమ్ ప్రొడక్షన్స్ ఈ మూవీని రూపొందిస్తుంది. ‘వెట్టువం’ సినిమా విడుదలయిన తర్వాత ఇదే కథను వెబ్ సిరీస్‌గా కూడా రూపొందిస్తారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International