కొడాలి నానిపై కొల్లు రవీంద్ర సీరియస్

ABN , First Publish Date - 2022-06-28T22:28:50+05:30 IST

మాజీ మంత్రి కొడాలి నాని పై టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్ అయ్యారు. కొడాలి నానిని ఓడించడానికి చంద్రబాబు అవసరం లేదన్నారు.

కొడాలి నానిపై కొల్లు రవీంద్ర సీరియస్

కృష్ణా: మాజీ మంత్రి కొడాలి నాని పై టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్ అయ్యారు. కొడాలి నానిని ఓడించడానికి చంద్రబాబు అవసరం లేదన్నారు. చంద్రబాబు ఇంటి కాపలా కుక్కను పెట్టి కొడాలి నానిని ఒడిస్తామన్నారు. కొడాలి నానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. గుడివాడ నుండి నానిని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గుడివాడలో మహానాడు పూర్తి అయ్యాకే మిగతా జిల్లాల్లో మహానాడులు నిర్వహిస్తామన్నారు. ఎన్టీఆర్ టీడీపీ సంపద... ఎన్టీఆర్ విగ్రహాలకు వైసీపీ రంగులు వేయడానికి నాని ఎవరు? అని ప్రశ్నించారు. 

Updated Date - 2022-06-28T22:28:50+05:30 IST