అమరావతి: మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర తీవ్ర స్థాయిలో విమర్శించారు. టీడీపీలో క్రమశిక్షణతో ఉన్న మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తర్వాత బూతుల మంత్రి అయ్యారని, ఇప్పుడు పేకాట మంత్రిగా పేరు గడించారని ఎద్దేవా చేశారు. ఆదిలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదన్నారు. ప్రస్తుతం కేసినో మంత్రిగా పేరు గడించిన కొడాలి నాని అరాచకం భవిష్యత్తులో ఏ స్థాయికి చేరుకుంటుందోనని కొల్లు రవీంద్ర అన్నారు.