Amaravathi : అగ్నికుల క్షత్రియుల భవన నిర్మాణానికి కేశినేని నాని(Kesineni Nani) పెద్ద హృదయంతో నిధులు కేటాయించారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర(Kollu Ravindra) వెల్లడించారు. భవన నిర్మాణానికి రూ.65 లక్షలు అంచనా అని చెబితే.. ఆ మొత్తాన్ని ఆమోదించేశారన్నారు. అగ్నికుల క్షత్రియుల భవన నిర్మాణం వల్ల కేవలం కృష్ణా, విజయవాడల్లో ఉన్న వారే కాకుండా.. ఏపీలోని అగ్నికుల క్షత్రియులంతా కేశినేని నానిని గుర్తుంచుకుంటారని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మత్స్యకారులకు అండగా ఉంటోంది టీడీపీనేనని.. వైసీపీ ఇప్పుడేదో మాయ మాటలు చెబుతోందన్నారు. వలలు, పడవలు లేకుండా మత్స్యకార భరోసా పేరుతో వైసీపీ మభ్యపెడుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో బెజవాడ లోక్‌సభ నుంచి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.