Abn logo
Apr 19 2021 @ 04:30AM

సర్వేపల్లి ఎమ్మెల్యేది అక్రమార్జన: కొల్లు రవీంద్ర

అమరావతి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): ‘‘ఇసుక అక్రమ రవాణా ద్వారా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థనరెడ్డి నెలకు రూ.2 కోట్లు అక్రమంగా పోగేసుకుంటున్నారు. పామాయిల్‌ ఫ్యాక్టరీల వద్ద టోల్‌గేట్లు పెట్టి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు’’ అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. టీడీపీ హయాంలో గోవర్థన్‌రెడ్డి నెల్లూరు జిల్లాలో మత్స్యకారేతర ప్యాకేజీ పంపిణీని అడ్డుకున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారని, రెండేళ్లయినా ఇంత వరకు అతీగతీ లేదని విమర్శించారు. ఎన్టీఆర్‌ సుజల స్రవంతి కింద టీడీపీ హయాంలో ప్రారంభించిన మెగా మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ నీళ్లను అమ్మి కరోనా కష్టకాలంలో సొమ్ము చేసుకున్న ఘనత గోవర్థన్‌రెడ్డిదేనని ఓ ప్రకటనలో ఆరోపించారు.

Advertisement
Advertisement
Advertisement