కొల్లేరు పక్షుల కేంద్రం కళావిహీనం

ABN , First Publish Date - 2022-05-27T06:09:08+05:30 IST

ప్రపంచప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సు విదేశీ, స్వదేశీ పక్షులకు ఆలవాలం. అలాంటి సరస్సులో నీరు అడుగంటిపోవడంతో కేంద్రం కళా విహీనంగా మారింది.

కొల్లేరు పక్షుల కేంద్రం కళావిహీనం
అడుగంటిన నీరు

మూలకు చేరిన మరబోట్లు

అడుగంటిన చెరువు నీరు

పక్షులకు ఆహారం కొరత

పట్టించుకోని అటవీ శాఖ 

 కైకలూరు, మే 26 : ప్రపంచప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సు విదేశీ, స్వదేశీ పక్షులకు ఆలవాలం. అలాంటి సరస్సులో నీరు అడుగంటిపోవడంతో కేంద్రం కళా విహీనంగా మారింది. 77,136 ఎకరాల్లో విస్తరించి ఉన్న కొల్లేరులో కైకలూరు మండలం ఆటపాకలో 310 ఎకరాల చెరువును పక్షుల కేంద్రంగా అటవీ శాఖ అధికారులు తీర్చిదిద్దారు. పర్యాటకులు అత్యంత సమీపం నుంచి పక్షులను తిలకించేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మరబోటు సౌకర్యాన్ని పర్యాటకులు కోల్పోయారు. ఏటా చెరువు లో నీరు తగ్గుతున్నా గట్టును పటిష్టం చేసి నీటి నిల్వలు పెంచేందుకు అటవీ శాఖ అధికారులు ఏ విధమైన చర్యలు చేపట్టకపోవ డంతో ఈ దుస్థితి ఏర్పడింది. అటపాక పక్షుల కేంద్రానికి ఏటా ఆస్ర్టేలి యా, సైబీరియా, నైజీరియా దేశాల నుంచి వేలాది పక్షులు వలస వస్తుంటాయి. అక్టోబర్‌ నుంచిమార్చి చివరి వరకు వచ్చిన విదేశీ పక్షులు గూడులను ఏర్పాటు చేసుకుని సంతానోత్పత్తి చేసుకునేందుకు పక్షుల కేంద్రం అనువైన ప్రదేశం. వేలాది పక్షుల రాకతో పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. పక్షుల విన్యాసాలు, పిల్లల కూతలను అత్యంత సమీపం నుంచి తిలకిం చేందుకు అటవీ శాఖ మరబోట్‌లను ఏర్పాటు చేశారు. అయితే వేసవిలో ఎండ తీవ్రతకు చెరు వులోని నీరు గణనీయంగా తగ్గిపోవడంతో మర బోట్‌లు తిరగకపోవడంతో పర్యాటకులు అసంతృప్తి వ ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా కొల్లేరు సరస్సులోకి భారీగా వరద నీరు రావడంతో గట్లు దెబ్బ తిని పక్షుల కేంద్రంలోని నీరు అడుగంటిపోయింది. ఏటా ఇదే తంతు నడుస్తున్నప్పటికీ గట్లను పటిష్టపరిచే చర్యలు చేపట్టకపోవ డంతో ఈ దుస్థితి ఏర్పడిందని పర్యాటక ప్రేమికులు వాపోతు న్నారు. వేసవిని దృష్టి లో పెట్టుకుని అధికా రులు కొద్ది మేర నీరు మోటార్లతో తోడిన ప్పటికీ పూర్తిస్థాయిలో చెరువును నింపడంలో విఫలమయ్యారు. ప్రణా ళికాబద్ధంగా చెరువును నింపితే పక్షులకు నీరు, ఆహారం సమృద్ధిగా లభించేదని పక్షి ప్రేమికులు పేర్కొంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన వలస పక్షుల్లో వయస్సు పైబడినవి వేసవిలో సైతం కొల్లేరులోనే జీవిస్తూ ఉంటాయి. ఇలా నివసించే స్వదేశీ, విదేశీ పక్షులకు ఆహారపు కొరత ఏర్పడుతోంది.


అభివృద్ధికి ప్రతిపాదనలు

ఆటపాక పక్షుల కేంద్రం అభివృద్ధికి ప్రణా ళికలు చేశాం. ఇప్పటికే పక్షుల కేంద్రం స్థితిగతులపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువె ళ్లాం. వారి ఆదేశాల మేరకు పనులు చేపడతాం.  

– జయప్రకాష్‌, డిప్యూటీ రేంజర్‌, కైకలూరు



Updated Date - 2022-05-27T06:09:08+05:30 IST