Kollam, Nagarsoilలకు ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2021-11-28T17:11:55+05:30 IST

చెన్నై సెంట్రల్‌, ఎగ్మూరు, తాంబరంల నుంచి కొల్లం, నాగర్‌కోయిల్‌లకు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు దక్షిణరైల్వే ప్రకటించింది. ఈ వివరాలను దక్షిణరైల్వే శనివారం విడుదల చేసింది. ఈ మూడు మార్గాల్లోని ప్రత్యేక రైళ్లకు

Kollam, Nagarsoilలకు ప్రత్యేక రైళ్లు

చెన్నై: చెన్నై సెంట్రల్‌, ఎగ్మూరు, తాంబరంల నుంచి కొల్లం, నాగర్‌కోయిల్‌లకు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు దక్షిణరైల్వే ప్రకటించింది. ఈ వివరాలను దక్షిణరైల్వే శనివారం విడుదల చేసింది. ఈ మూడు మార్గాల్లోని ప్రత్యేక రైళ్లకు ఆదివారం నుంచే రిజర్వేషన్‌ చేసుకోవచ్చని తెలిపింది. వివరాలిలా వున్నాయి... 


చెన్నై సెంట్రల్‌ - కొల్లం

06007 నెంబరు గల ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ డిసెంబరు 3, 10, 17, 24, 31, జనవరి 7, 10, 12, 14 తేదీల్లో సాయంత్రం 4 గంటలకు చెన్నై సెంట్రల్‌లో బయలుదేరి మరునాడు ఉదయం 8.30 గంటలకు కొల్లం చేరుకుంటుంది. అదే విధంగా 06008 నంబరు గల ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ డిసెంబరు 5, 12, 19, 26, జనవరి 2, 9, 11, 13, 16 తేదీల్లో ఉదయం 11.30 గంటలకు కొల్లంలో బయలుదేరి మరునాడు సాయంత్రం 4 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుంది. 3 ఏసీ త్రీటైర్‌, 8 స్లీపర్‌ బోగీలు, 6 జనరల్‌ సెకండ్‌క్లాస్‌ బోగీలు కలిగిన ఈ రైళ్లు అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, కోయంబత్తూర్‌, పాలక్కాడ్‌, త్రిశూర్‌, అలువ, ఎర్నాకులం టౌన్‌, కొట్టాయం, చంగనస్సేరి, తిరువళ్ల, చెంగన్నూర్‌, మావేలికారా, కయన్‌కుళం స్టేషన్లలో ఆగుతాయి. 06008 ఎక్స్‌ప్రెస్‌ అదనంగా పెరంబూరులోనూ ఆగుతుంది. 


నాగర్‌కోయిల్‌కు ప్రత్యేక సూపర్‌ఫాస్ట్‌

ఎగ్మూర్‌ - నాగర్‌కోయిల్‌ నడుమ ప్రత్యేక సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లు తిరగనున్నాయి. 06005 నంబరు గల సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎగ్మూరులో డిసెంబరు 23వ తేదీ సాయంత్రం 3.30 గంటలకు బయలుదేరి మరునాడు ఉదయం 4.20 గంటలకు నాగర్‌కోయిల్‌ చేరుకుంటుంది. అదే విధంగా 06006 నంబరు గల సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ డిసెంబరు 24వ తేదీ సాయంత్రం 3.10 గంటలకు నాగర్‌కోయిల్‌లో బయలుదేరి మరునాడు ఉదయం 5.20 గంటలకు ఎగ్మూర్‌ చేరుకుంటుంది. 1 ఏసీ ఫస్ట్‌క్ల్లాస్‌ కం ఏసీ టూ టైర్‌ కోచ్‌, 3 ఏసీ టూటైర్‌, 2 ఏసీ త్రీటైర్‌, 13 స్లీపర్‌క్లాస్‌, 4 జనరల్‌ సెకండ్‌క్లాస్‌ బోగీలు కలిగిన ఈ రైళ్లు తాంబరం, చెంగల్పట్టు, విల్లుపురం, విరుదాచలం, తిరుచ్చి, దిండుగల్‌, మదురై, విరుదునగర్‌, సాత్తూర్‌, కోవిల్‌పట్టి, తిరునల్వేలి, వల్లియూర్‌ స్టేషన్లలో ఆగుతాయి. 06006 రైలు మాంబళం స్టేషన్‌లోనూ ఆగుతుంది.


తాంబరం - నాగర్‌కోయిల్‌

తాంబరం - నాగర్‌కోయిల్‌ నడుమ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లు తిరగనున్నాయి. 06004 నంబరు గల సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ డిసెంబరు 26వ తేదీ సాయంత్రం 7.30 గంటలకు నాగర్‌కోయిల్‌లో బయలుదేరి మరునాడు ఉదయం 7.55 గంటలకు తాంబరం చేరుకుంటుంది. అదే విధంగా 06003 నంబరు గల సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ డిసెంబరు 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు తాంబరంలో బయలుదేరి మరునాడు ఉదయం 4.20 గంటలకు నాగర్‌కోయిల్‌ చేరుకుంటుంది. 1 ఏసీ టూటైర్‌, 5 ఏసీ త్రీటైర్‌, 11 స్లీపర్‌క్లాస్‌, 4 జనరల్‌ సెకండ్‌క్లాస్‌ బోగీలున్న ఈ రైళ్లు వల్లియూర్‌, తిరునల్వేలి, కోవిల్‌పట్టి, సాత్తూర్‌, విరుదునగర్‌, మదురై, దిండుగల్‌, తిరుచ్చి, విరుదాచలం, విల్లుపురం, చెంగల్పట్టు స్టేషన్లలో ఆగుతాయి.

Updated Date - 2021-11-28T17:11:55+05:30 IST