కోళ్ల పాకలో కొండ చిలువ

ABN , First Publish Date - 2022-08-08T02:26:11+05:30 IST

మండలంలోని నందవరంలోని ఓ కోళ్ల పాకలో కొండ చిలువ ఆదివారం హల్‌చల్‌ చేసింది. గ్రామ శివార్లలో ఓ వ్యక్తి పాక వేసుకొని కో

కోళ్ల పాకలో కొండ చిలువ
పాకలో ఉన్న కొండ చిలువ

 మర్రిపాడు, ఆగష్టు 7 : మండలంలోని నందవరంలోని ఓ కోళ్ల పాకలో కొండ చిలువ ఆదివారం హల్‌చల్‌ చేసింది. గ్రామ శివార్లలో ఓ వ్యక్తి పాక వేసుకొని కోళ్లను పెంచుకుంటున్నాడు. ఆ పాకలో సుమారు 15 అడుగుల పొడువున్న కొండ చిలువను గ్రామస్థులు గమనించి,  యజమానికి సమాచారం ఇచ్చారు. అప్పటికే  చాలా కోళ్లను కొండ చిలువ మింగేసినట్లు యజమాని గుర్తించారు. కాగా కొండ చిలువను చూసేందుకు  గ్రామస్థులు భారీగా తరలివచ్చారు.


Updated Date - 2022-08-08T02:26:11+05:30 IST