‘కోళ్ల ఫారం రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి’

ABN , First Publish Date - 2022-05-27T06:04:35+05:30 IST

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కోళ్లఫారం రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర కోళ్లఫారాల రైతు సంఘం నాయకుడు సుధాకరరావు కోరారు. గురువారం అన్నవరంలో జరిగిన ఆంధ్రప్రదేశ రాష్ట్ర కోళ్లఫారం రైతుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

‘కోళ్ల ఫారం రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి’
కోళ్ల ఫారం రైతుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర కోళ్లఫారాల రైతు సంఘం నాయకుడు సుధాకరరావు

అన్నవరం, మే 26: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కోళ్లఫారం రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర కోళ్లఫారాల రైతు సంఘం నాయకుడు సుధాకరరావు కోరారు. గురువారం అన్నవరంలో జరిగిన ఆంధ్రప్రదేశ రాష్ట్ర కోళ్లఫారం రైతుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పసికూనల్లాంటి కోడి పిల్లలను 40 నుంచి 50 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ అందిస్తున్నామన్నారు. ఖర్చులు పెరగడంతో తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. కోడిపిల్లలు వచ్చే తేదీని రైతుకు ఐదు రోజులు ముందుగా తెలియపర్చాలని, ట్రేడర్‌కు ఎంతిస్తున్నారో రైతుకూ అంతే ఇవ్వాలని, రైతుతో సంబంధం లేకుండా ట్రేడరే లిస్టింగ్‌ చేయాలని, 5శాతంలోపు మొర్టాలిటీ వస్తే కంపెనీయే భరించాలని, మార్కెట్‌ రేటులో ఎంతున్నా వాటిలో 50శాతం గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా చెల్లించాలని, ఏ కంపెనీ అయినా సంవత్సరానికి విధిగా ఆరు బ్యాచ్‌లు వచ్చేలా చూడాలని తదితర 20 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. కార్పొరేట్‌ వలలో చిక్కుకుని కోళ్లఫారం రైతులు నలిగిపోతున్నారని ఏపీ కోళ్లఫారం రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజారావు పేర్కొన్నారు. తమ డిమాండ్లకు ప్రధాన కారణం పెరిగిన నిర్వహణా వ్యయమేనని అన్నారు. కోళ్లఫారం రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో త్వరలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సమావే శంలో జిల్లా అధ్యక్షుడు ఆకుల వీరబాబు, పగడాల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-27T06:04:35+05:30 IST