చెలరేగిన ఉమేశ్
పంజాబ్పైౖ కోల్‌కతా గెలుపు
4/23
ఐపీఎల్లో ఉమేశ్ ఉత్తమ ప్రదర్శన ఇదే
250
షారుక్‌ను
అవుట్ చేసిన సౌథీ టీ20లలో 250వ వికెట్ సాధించాడు
ముంబై: ఆండ్రీ రస్సెల్ సుడిగాలి ఇన్నింగ్స్ (31 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 70 నాటౌట్), అంతకుముందు ఉమేశ్ యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగిన వేళ కోల్‌కతా నైట్‌రైడర్స్ లీగ్‌లో రెండో విజయం అందుకుంది. 138 పరుగుల మోస్తరు లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే టాపార్డర్‌ను చేజార్చుకుని ఒత్తిడిలో పడిన తరుణంలో రస్సెల్ ప్రత్యర్థి బౌలర్లను ఎడాపెడా బాదేసి మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మొదట పంజాబ్ 18.2 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. రాజపక్ష (9 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 31) టాప్‌స్కోరర్ కాగా, రబాడ (16 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 25), లివింగ్‌స్టోన్ (19) పర్లేదనిపించారు. ఉమేశ్ (4/23) నాలుగు, సౌథీ (2/36) రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం కోల్‌కతా 14.3 ఓవర్లలో 141/4 స్కోరు చేసి గెలుపొందింది. శ్రేయాస్ (15 బంతుల్లో 5 ఫోర్లతో 26), బిల్లింగ్స్ (23 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 24 నాటౌట్) రాణించారు. రాహుల్ చాహర్ (2/13) రెండు వికెట్లు తీశాడు. ఉమేశ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
ఆరంభంలో తడ‘బ్యాటు’:
భారీ హిట్టర్లతో కూడిన నైట్‌రైడర్స్ లక్ష్యాన్ని అలవోకగానే ఛేదిస్తుందనిపించింది. కానీ పంజాబ్ బౌలర్లు ముఖ్యంగా స్పిన్నర్ చాహర్ విజృంభించడంతో స్వల్ప స్కోరుకే టాపార్డర్ వెనుదిరగడంతో ఇబ్బందులో పడింది. అయితే రస్సెల్ భారీ షాట్లతో విరుచుకుపడి పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లాడు. రహానె (12), వెంకటేశ్ అయ్యర్ (3), శ్రేయాస్, నితీశ్ రాణా (0) నిష్క్రమించేసరికి కోల్‌కతా స్కోరు 51/4. దాంతో పంజాబ్ రేసులో కొచ్చిన సమయంలో రస్సెల్ విశ్వరూపం ప్రదర్శించాడు. బ్రార్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు సంధించిన రస్సెల్ జట్టుపై ఒత్తిడి తగ్గించాడు. అనంతరం స్మిత్ వేసిన 12వ ఓవర్లో 4,6,6,6తో రస్సెల్ కదం తొక్కగా, బిల్లింగ్స్ తనవంతుగా ఇంకో 6 కొట్టడంతో ఆ ఓవర్లో కోల్‌కతా ఏకంగా 30 పరుగులు కొల్లగొట్టింది. అర్ష్‌దీప్ బంతిని బౌండరీకి తరలించి 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రస్సెల్ అతడి బౌలింగ్‌లోనే మరో సిక్సర్, అనంతరం లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో 6,6తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
ఉమేశ్ జోరు..:
కోల్‌కతా ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో పవర్ ప్లేలోనే రెండేసి వికెట్లు తీసి అద్భుత ఫామ్‌లో ఉన్న పేసర్ ఉమేశ్ యాదవ్ ఈ పోరులోనూ ఆ జోరు కొనసాగించాడు. ఉమేశ్ ఆఫ్స్టం్పపై వేసిన ఫుల్‌లెంగ్త్ బంతిని అడ్డంగా ఆడబోయిన మయాంక్ తొలి ఓవర్లోనే ఎల్బీగా నిష్క్రమించాడు. బెంగళూరుతో మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన రాజపక్ష వస్తూనే సౌథీ, ఉమేశ్ బౌలింగ్‌లలో బౌండరీలు బాదగా..ధవన్ కూడా బ్యాట్ ఝళిపిస్తూ సిక్సర్ కొట్టాడు. ఆపై రాజపక్ష మరింత దూకుడు ప్రదర్శించి యువ పేసర్ మావి బౌలింగ్‌లో 4,6,6,6 దంచడంతో పంజాబ్ స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. కానీ మావి బౌలింగ్‌లోనే ఇంకో భారీ షాట్ కొట్టబోయిన రాజపక్ష మిడా్‌ఫలో సౌథీకి సునాయాస క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దాంతో 41 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. వెంటనే ధవన్ (16)ను సౌథీ పెవిలియన్‌కు చేర్చడంతో..మూడు వికెట్లు కోల్పోయినా పవర్ ప్లే ముగిసే సరికి పంజాబ్ 62 పరుగులు చేయగలిగింది. త్వరత్వరగా రెండు వికెట్లు పడడంతో లివింగ్ స్టోన్, రాజ్ బవా ఆచితూచి ఆడడంతో స్కోరులో వేగం తగ్గిపోయింది.
ఈ తరుణంలో రెండో స్పెల్ బౌలింగ్‌కు వచ్చిన ఉమేశ్..లివింగ్‌స్టోన్‌ను అవుట్ చేసిపంజాబ్కు మరోసారి షాకివ్వగా..తెలివైన బంతితో బవా (11)ను నరైన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. దాంతో సగం ఓవర్లు ముగిసే సరికి ‘కింగ్స్’ 85/5తో చిక్కుల్లో పడింది. మరోవైపు రెండో స్పెల్‌కు బౌలింగ్ దిగిన సౌథీ 13వ ఓవర్లో షారుక్‌ఖాన్ (0) క్యాచవుట్ చేశాడు. ఇక తన చివరి ఓవర్లో హర్‌ప్రీత్ బ్రార్ (14), రాహుల్ చాహర్ (0)ను ఉమేశ్ వెనక్కిపంపి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. 17వ ఓవర్లో రబాడ 4,4,6 కొట్టడంతో కోల్‌కతా 16 పరుగులు రాబట్టింది. తర్వాత మావి ఓవర్లో రబాడ 4,4, ఓడియన్ స్మిత్ 6 బాదారు. కానీ 19 ఓవర్లో సౌథీ అద్భుత రిన్నింగ్ క్యాచ్‌తో రబాడ ఇన్నింగ్స్‌కు తెరపడగా..తదుపరి బంతికి అర్ష్‌దీప్ రనౌట్ కావడంతో మరో పది బంతులు మిగిలుండగానే పంజాబ్ ఆలౌటైంది.