Abn logo
Mar 30 2020 @ 04:47AM

కోల్‌కతాలో యాప్‌లో చేపలు..!

  • బెంగాల్‌ సర్కారు ఆఫర్‌

కోల్‌కతా, మార్చి 29: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు పశ్చిమబెంగాల్‌ సర్కారు వినూత్న ఆలోచన చేసింది. కోల్‌కతాలో ఎవరికైనా చేపలు కావాలంటే ఇక ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయొచ్చు. ఇందుకోసం ఆ రాష్ట్ర మత్స్య పరిశ్రమ అభివృద్ధి సంస్థ (ఎస్‌ఎ్‌ఫడీసీ) ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉన్న ఎస్‌ఎ్‌ఫడీసీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని కోల్‌కతా వాసులు వివిధ రకాల తాజా చేపలను ఆర్డర్‌ చేయొచ్చని బెంగాల్‌ మత్స్య శాఖ మంత్రి చంద్రనాథ్‌ సిన్హా తెలిపారు. చేపల ధరలు విపరీతంగా పెంచేశారన్న ఫిర్యాదులు ఎక్కువవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. యాప్‌తో పాటు జిల్లాల్లో తమ వాహనాల్లో చేపలు తీసుకెళ్లి విక్రయిస్తామని తెలిపారు. అలాగే జిల్లాల్లో వీలైనన్ని ఎక్కువ మార్కెట్లకు చేపలు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.

Advertisement
Advertisement
Advertisement