Prophet Row : నూపుర్ శర్మకు లుక్‌అవుట్ నోటీసు జారీ చేసిన కోల్‌కతా పోలీసులు

ABN , First Publish Date - 2022-07-02T22:22:26+05:30 IST

భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి సస్పెన్షన్‌కు గురైన నూపుర్

Prophet Row : నూపుర్ శర్మకు లుక్‌అవుట్ నోటీసు జారీ చేసిన కోల్‌కతా పోలీసులు

కోల్‌కతా : భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి సస్పెన్షన్‌కు గురైన నూపుర్ శర్మ (Nupur Sharma)కు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా (Kolkata) పోలీసులు లుక్‌అవుట్ నోటీసు (Lookout notice) జారీ చేశారు. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్‌ (Prophet Muhhamad) గురించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో ఈ చర్య తీసుకున్నారు. రెండు పోలీస్ స్టేషన్ల అధికారులు ఆమెకు ఈ నోటీసులిచ్చారు. 


నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఆమె యావత్తు దేశానికి క్షమాపణ చెప్పాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు స్పందించారు.


Updated Date - 2022-07-02T22:22:26+05:30 IST