Advertisement
Advertisement
Abn logo
Advertisement

టిమ్ సౌథీతో ‘కోల్‌కతా’ ఒప్పందం

కోల్‌కతా: సెప్టెంబరు 19 నుంచి యూఏఈలో ప్రారంభం కానున్న ఐపీఎల్ పార్ట్-2 నుంచి పలువురు క్రికెటర్లు వివిధ కారణాలు చూపుతూ తప్పుకోవడంతో వారి స్థానాలను భర్తీ చేసేందుకు తంటాలు పడుతున్న ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్లను వెతుక్కునే పనిలో పడ్డాయి. సరైన ఆటగాడిని వెతికి పట్టుకోవడంలో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు ఆటగాళ్ల భర్తీని దాదాపు పూర్తిచేయగా, మరికొన్ని అదే పనిలో ఉన్నాయి. యూఏఈలో అడుగుపెట్టడానికి ముందే ఖాళీ స్థానాలను భర్తీ చేసుకోవాలని భావిస్తున్నాయి. 


తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీని జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్ రెండో దశ నుంచి ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ తప్పుకోవడంతో అతడి స్థానాన్ని సౌథీతో భర్త చేసింది. ఈ మేరకు అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. సౌథీ గతంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. వరుసగా ఆరు సీజన్లు ఆడిన సౌథీ గతేడాది వేలంలో అమ్ముడుపోలేదు. చివరిసారి 2019 ఐపీఎల్‌లో కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబీకి ఆడాడు. 

Advertisement
Advertisement