Chandrakant Pandit: కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్‌గా చంద్రకాంత్ పండిట్

ABN , First Publish Date - 2022-08-18T03:46:34+05:30 IST

దేశవాళీ క్రికెట్ లెజండ్ చంద్రకాంత్ పండిట్‌(Chandrakant Pandit)ను కొత్త కోచ్‌గా నియమిస్తూ ఐపీఎల్(IPL) ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) ప్రకటన చేసింది.

Chandrakant Pandit: కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్‌గా చంద్రకాంత్ పండిట్

కోల్‌కతా : దేశవాళీ క్రికెట్ లెజండ్ చంద్రకాంత్ పండిట్‌(Chandrakant Pandit)ను కొత్త కోచ్‌గా నియమిస్తూ ఐపీఎల్(IPL) ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) ప్రకటన చేసింది. ఇంతకాలం కోచ్‌గా వ్యవహరించిన న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెక్‌కల్లమ్ ఇటివలే ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. దీంతో కొత్త కోచ్‌గా చంద్రకాంత్ పండిట్‌ను ఎంపిక చేసినట్టు కేకేఆర్(KKR) తెలిపింది. కోల్‌కతా నైట్ రైడర్స్ కుటుంబంలో చందు చేరిక చాలా సంతోషంగా ఉందని కేకేఆర్ సీఈవో వెంకీ మైసోర్ తెలిపారు. వచ్చే సీజన్‌ను కేకేఆర్ ప్రయాణాన్ని నడిపించనున్నారని పేర్కొన్నారు. ఆయన ట్రాక్ రికార్డ్, దేశవాళీ క్రికెట్ విజయవంతమైన రికార్డులు ఆయనేంటో తెలియజేస్తున్నాయని అన్నారు.


కాగా ఈ ఏడాదే తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడిన మధ్యప్రదేశ్‌కు చంద్రకాంత్ పండిటే కోచ్‌గా వ్యవహరించాడు. 2018, 2019 సీజన్లలో రంజీ ట్రోఫీ గెలిచిన విదర్భ జట్టుకు కూడా కోచ్‌గా సేవలు అందించాడు. దేశవాళీ క్రికెట్‌లో టాప్ టీమ్‌లలో ఒకటైన ముంబైకి కూడా కోచ్‌గా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. చంద్రకాంత్ పండిట్ భారత్ తరపున 5 టెస్టు మ్యాచ్‌లు, 36 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 48కిపైగా సగటుతో 8000 వేలకుపైగా పరుగులు చేశాడు. కాగా కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటివరకు 2 సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.

Updated Date - 2022-08-18T03:46:34+05:30 IST