Abn logo
Oct 11 2021 @ 02:00AM

ఇంటికెళ్లేదెవరో?

 రాత్రి 7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో

ఎలిమినేటర్‌లో కోల్‌కతా-బెంగళూరు పోరు నేడు

షార్జా: సమవుజ్జీల సమరంలో కోహ్లీ దూకుడు పని చేస్తుందా?.. మోర్గాన్‌ మంత్రాంగం పైచేయిగా నిలుస్తుందా? అనేది ఉత్కంఠగా మారింది. సోమవారం జరిగే ఐపీఎల్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడనుంది. ఇందులో నెగ్గిన జట్టు క్వాలిఫయర్‌-2కు చేరుకోనుండగా.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. బలాబలాల పరంగా చూస్తే ఇరుజట్లూ సమంగానే ఉన్నా.. ప్రయోగాలతో నైట్‌రైడర్స్‌ కొంత పైచేయిగా కనిపిస్తోంది. బెంగళూరుకు తొలి ఐపీఎల్‌ టైటిల్‌ అందించి.. గ్రాండ్‌గా కెప్టెన్సీకి వీడ్కోలు పలకాలని కోహ్లీ పట్టుదలతో ఉన్నాడు.