శ్రీవారి సన్నిధిలో బాలల కోలాట ప్రదర్శన
ద్వారకాతిరుమల, జూన్ 26: చినవెంకన్న ఆలయ అనివేటి మండప ప్రాంతం లో బాలలు కోలాట ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. సంప్రదాయ దుస్తులు ధరించి క్షేత్రానికి వచ్చి కోలాటాలు జరుపుతూ ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దేవతా మూర్తులను కీర్తిస్తూ కోలాటాన్ని ప్రదర్శించడంతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.