మేడారంలో కొలనుపాక వాసి మృతి

ABN , First Publish Date - 2021-02-25T06:09:42+05:30 IST

ఆలేరు రూరల్‌, ఫిబ్రవరి 24: మేడారం జాతరకు వెళ్లిన నల్లగొండ కొలనుపాక గ్రామానికి చెందిన పూర్ణ రమేష్‌ (45) అనారోగ్యంతో బుధవారం మృతిచెందాడు.

మేడారంలో కొలనుపాక వాసి మృతి

 వంట చేస్తుండగా అస్వస్థత

ఆలేరు రూరల్‌, ఫిబ్రవరి 24: మేడారం జాతరకు వెళ్లిన నల్లగొండ కొలనుపాక గ్రామానికి చెందిన పూర్ణ రమేష్‌ (45) అనారోగ్యంతో బుధవారం మృతిచెందాడు.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న రమేష్‌ మంగళవారం తల్లి లలిత, భార్యాపిల్లలతో మేడారానికి వెళ్లి సమ్మక్క-సారక్కలను దర్శనం చేసుకున్నారు. వంట చేస్తున్న క్రమంలో అనా రోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మృతి చెందాడు.

 చింతచెట్టు పైనుంచి పడి ఒకరు ..

యాదాద్రి రూరల్‌, ఫిబ్రవరి 24:  చింతచెట్టు పైనుంచి పడి ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుట్ట మునిసిపల్‌ పరిధిలోని ఆరో వార్డుకు చెందిన  వల్లపు కనకయ్య (35) రైతు తాళ్ల మహేందర్‌రెడ్డి వ్యవసాయ బావి వద్ద మంగళవారం  చింతకాయలు తెంపడానికి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కనకయ్యను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తర లిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.


 11 దుకాణాలకు జరిమానా 

మోత్కూరు, ఫిబ్రవరి 24: వెూత్కూరులో మునిసిపల్‌ కమిషనర్‌ షేక్‌ మహమూద్‌ దుకాణాలను తనిఖీ చేశారు.  లైసెన్సులేని, రోడ్డును ఆక్ర మించి సామాను విక్రయిస్తున్న 11 మంది దుకాణదారులకు  రూ.వెయ్యి నుంచి రూ.5 వేలు జరిమానా విధించారు. 


అగ్ని ప్రమాదంలో బాలుడికి గాయాలు 

ఆత్మకూరు(ఎం),ఫిబ్రవరి 24:  కట్టెల పొయ్యి  మంటలు అంటుకోవ డంతో బాలుడు గాయపడ్డాడు.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తుక్కాపురం గ్రామానికి చెందిన బద్దుల మంజుల సీసా లోని పెట్రోల్‌తో  కట్టెల పొయ్యిని రాజేసి ఇంట్లోకి వెళ్లింది.   అక్కడే ఉన్న  మంజుల  చిన్న కుమారుడు (6) పెట్రోల్‌ సీసాను పొయ్యిలోకి విసిరాడు. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి  అంటుకోవడంతో తీవ్రంగా గాయ పడ్డాడు. బాలుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

లారీ యజమాని ఆత్మహత్యాయత్నం

వలిగొండ, ఫిబ్రవరి 24: ఆర్థిక ఇబ్బందులతో లారీ యజమాని ఆత్మ హత్యాయత్నం చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  మండలంలోని గురునాథపల్లి గ్రామానికి చెందిన లారీ యజమాని ఏ.కృష్ణయ్య (50)  కరోనా నేపథ్యంలో లారీకి గిరాకీ లేనందున  అప్పులు ఎక్కువయ్యాయి. మనస్తాపంతో ఇంట్లో పురుగు మందు తాగాడు. కృష్ణయ్యను చికిత్స నిమిత్తం 108 అంబులెన్సులో భువనగిరికి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

రోడ్డు ప్రమాద కారకుడికి జైలు, జరిమానా

మోటకొండూరు, ఫిబ్రవరి 24: రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తికి జైలు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.  ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చాడ గ్రామం బెజ్జంకిబావికి చెందిన వి. శ్రీకాంత్‌రెడ్డి 2014 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి కారకుడని రుజువు అయినందున ఏడాది జైలు, రూ.2 వేలు జరిమానా విధిస్తూ ఆలేరులోని జూనియర్‌ సివిల్‌ జడ్జి తీర్పు చెప్పారన్నారు. 


భర్తపై కేసు నమోదు 

చౌటుప్పల్‌ రూరల్‌, ఫిబ్రవరి24:   మండల పరిధిలోని లక్కారం గ్రామానికి చెందిన బొల్లమోని చంద్రయ్య భార్య పారిజాతను  కొంత కాలంగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. ఈ మేరకు భార్య ఫిర్యాదు మేరకు భర్త చంద్రయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-02-25T06:09:42+05:30 IST