మహిళా దినోత్సవం రోజున కూతురితో ఉన్న అనుష్క ఫోటో షేర్ చేసిన కోహ్లీ..

ABN , First Publish Date - 2021-03-08T23:36:23+05:30 IST

మహిళా దినోత్సవం సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. భార్య అనుష్క ఫోటో షేర్ చేశాడు. ఈ ఫోటోలో అనుష్క తమ కుమార్తె వామికను ఎత్తుకుని ముద్దాడుతోంది. ఇన్‌స్టాగ్రాంలో ఈ ఫోటో పోస్ట్ ..

మహిళా దినోత్సవం రోజున కూతురితో ఉన్న అనుష్క ఫోటో షేర్ చేసిన కోహ్లీ..

ఇంటర్నెట్ డెస్క్: మహిళా దినోత్సవం సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. భార్య అనుష్క ఫోటో షేర్ చేశాడు. ఈ ఫోటోలో అనుష్క తమ కుమార్తె వామికను ఎత్తుకుని ముద్దాడుతోంది. ఇన్‌స్టాగ్రాంలో ఈ ఫోటో పోస్ట్ చేసిన కోహ్లీ.. ‘ఓ బిడ్డకు జన్మనివ్వడం సాధారణ విషయం కాదు. ఆ సమయంలో తల్లి అనుభవించే అనుభూతి మాటలతో వర్ణించలేం. అదే వారి గొప్పతనానికి, దృఢత్వానికి నిదర్శనం. పురుషులకంటే మహిళలు ఎన్నో రెట్లు శక్తివంతులు. అందుకే నా జీవితంలోని అత్యంత దృఢమైన, కారుణ్యమూర్తయిన మహిళకు, అలాగే భవిష్యత్తులో తన తల్లిలాగే గొప్ప వ్యక్తిగా ఎదిగబోతున్న చిట్టి తల్లికి ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ప్రపంచంలోని మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ అని విరాట్ రాసుకొచ్చాడు.



Updated Date - 2021-03-08T23:36:23+05:30 IST