బీసీసీఐపై గుర్రుగా ఉన్న కోహ్లీ.. సౌతాఫ్రికా పర్యటనకు డౌటే!

ABN , First Publish Date - 2021-12-11T01:46:21+05:30 IST

చెప్పాపెట్టకుండా తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించినందుకు విరాట్ కోహ్లీ బీసీసీఐపై గుర్రుగా ఉన్నాడా?

బీసీసీఐపై గుర్రుగా ఉన్న కోహ్లీ.. సౌతాఫ్రికా పర్యటనకు డౌటే!

ముంబై: చెప్పాపెట్టకుండా తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించినందుకు బీసీసీఐపై  విరాట్ కోహ్లీ గుర్రుగా ఉన్నాడా? దక్షిణాఫ్రికా సిరీస్‌కు డుమ్మా కొట్టబోతున్నాడా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. కెప్టెన్సీ నుంచి తనను తొలగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్న విరాట్.. దక్షిణాఫ్రికా పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.


నిజానికి 2023 వన్డే ప్రపంచకప్‌పై దృష్టి సారించేందుకే టీ20 కోహ్లీ కెప్టెన్సీని వదిలుకున్నాడని, ప్రపంచకప్‌ను దేశానికి అందించిన తర్వాత గౌరవంగా కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాలనుకున్నాడని అతడి సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. 


అయితే, అకస్మాత్తుగా కెప్టెన్సీ నుంచి అతడిని తప్పించడాన్ని అవమానంగా భావిస్తున్న కోహ్లీ  సౌతాఫ్రికా పర్యటన నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడని చెబుతున్నారు. అంతేకాదు, వన్డే, టీ20లకు గుడ్‌బై చెప్పేసి టెస్టుల్లో మాత్రమే కొనసాగాలన్న యోచనలోనూ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో అతడు సౌతాఫ్రికా వెళ్లే ఫ్లైట్ ఎక్కుతాడో, లేదో చూడాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.   

Updated Date - 2021-12-11T01:46:21+05:30 IST