Advertisement
Advertisement
Abn logo
Advertisement

కోహ్లీ అవుటా.. నాటౌటా!

టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత తొలిసారి క్రీజులో అడుగుపెట్టిన కెప్టెన్‌ కోహ్లీకి తొలి రోజు ఆటలో నిరాశే ఎదురైంది. స్పిన్నర్‌ ఎజాజ్‌ ఓవర్‌లో వివాదాస్పద రీతిలో డకౌట్‌ కావాల్సి వచ్చింది. ఇన్నింగ్స్‌ 30వ ఓవర్‌ నాలుగో బంతిని కోహ్లీ పుష్‌ చేయాలని చూశాడు. కానీ బంతి టర్న్‌ కాకుండా నేరుగా అతడి ప్యాడ్లను తాకింది. దీంతో కివీస్‌ అప్పీల్‌ మేరకు అంపైర్‌ కోహ్లీని ఎల్బీగా ప్రకటించాడు. విరాట్‌ వెంటనే డీఆర్‌ఎస్‌ కోరాడు. అయితే అలా్ట్రఎడ్జ్‌లో బంతి ముందు బ్యాట్‌కు తాకిందా.. లేక ప్యాడ్‌కు తాకిందా అనే విషయంలో మూడో అంపైర్‌ నిర్ధారణకు రాలేకపోయాడు.


అయితే బంతి మాత్రం ఇన్‌లైన్‌లో పడి వికెట్లను తాకుతున్నట్టు బాల్‌ ట్రాకింగ్‌లో స్పష్టంగా కనిపించింది. దీంతో అంతిమ నిర్ణయం ఫీల్డ్‌ అంపైర్‌కే వదిలేయడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన కోహ్లీ లెగ్‌ అంపైర్‌తో మాట్లాడాడు. బంతి ముందు బ్యాట్‌కు తాకిందని చెప్పడం కనిపించింది. ఆ తర్వాత కోపంతో వెనుదిరుగుతూ బౌండరీ లైన్‌ రోప్‌ను విసురుగా బ్యాట్‌తో కొడుతూ పెవిలియన్‌కు చేరాడు. మరోవైపు ఎంసీసీ రూల్‌ మాత్రం.. ఇలా బంతి ఒకేసారి బ్యాట్‌, ప్యాడ్‌కు తాకుతున్నట్టు కనిపిస్తే ముందుగా బ్యాట్‌కు కాంటాక్ట్‌ అయినట్టుగానే భావించాలని చెబుతోంది. అటు కామెంటేటర్లు కూడా కోహ్లీ నాటౌట్‌ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement