Advertisement
Advertisement
Abn logo
Advertisement

కోహ్లీ ఈ గ్రహం మీదే అతిపెద్ద సూపర్ స్టార్.. మేమతడికి థ్యాంక్స్ చెప్పాలి: షేన్ వార్న్

లండన్: టీమిండియా సారథి విరాట్ కోహ్లీపై ఆసీస్ లెజండ్ షేన్‌వార్న్ ప్రశంసలు కురిపించాడు. అతడు ఈ భూ గ్రహం మీదే అతిపెద్ద సూపర్ స్టార్ అని, అతడు ఆటగాళ్లందరి గౌరవాన్ని పొందాడని కొనియాడాడు. కెప్టెన్‌గా అతడు మళ్లీ మళ్లీ నిరూపించుకుంటూనే ఉన్నాడని పేర్కొన్నాడు. ఓవల్‌లో నిన్న ముగిసిన నాలుగో టెస్టులో భారత బౌలర్లు చెలరేగడంతో 157 పరుగుల భారీ తేడాతో కోహ్లీసేన విజయం సాధించింది. కోహ్లీ తన సహచరులపై అదే నమ్మకాన్ని కలిగి ఉండడం ద్వారా జట్టులో ఓ వైవిధ్యాన్ని తీసుకొచ్చాడని అభిప్రాయపడ్డాడు. ‘‘ఆటగాళ్లందరి  గౌరవాన్ని కోహ్లీ చూరగొన్నాడు. అతడు వారికి వెనక ఉంటాడు. వారు అతడి కోసం ఆడతారు. కెప్టెన్‌గా ఇది అతడికి చాలా ముఖ్యం. విరాట్ తనకు తానుగా ప్రవర్తించే విధానానికి మనందరం ‘థ్యాంక్యూ విరాట్’ అని చెప్పాలి’’ అని వార్న్ పేర్కొన్నాడు.  

Advertisement
Advertisement