Abn logo
Feb 21 2020 @ 20:36PM

ఆసియా ఎక్స్‌ఐ జట్టులో కోహ్లీ, ధవన్, షమీ, కుల్దీప్ పేర్లు

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ జాతి పిత షేక్ ముజిబుర్ రహ్మన్ జన్మదినం సందర్భంగా ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియం వేదికగా ఆసియా ఎక్స్‌ఐ, వరల్డ్ ఎక్స్‌ఐ మధ్య టీ-20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో పాల్గొనేందుకు భారత క్రికెటర్ల పేర్లను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు పంపించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ శిఖర్ ధవన్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్‌లో ఈ మ్యాచ్‌లో పాల్గొంటారని బీసీబీకి గంగూలీ సూచించారు. 


‘‘అందుబాటులో ఉన్న ఆటగాళ్ల వివరాలను గంగూలీ బీసీబీకి పంపించారు. కోహ్లీ, షమీ, ధవన్, కుల్దీప్ ఆసియా ఎక్స్‌ఐ టీంలో భారత్‌కు ప్రతినిధ్యం వహిస్తారు. ఇంకా సమయం ఉండగానే మనవాళ్ల పేర్లు పంపించాము ఎందుకంటే బంగ్లా బోర్డు పూర్తి జట్టును సిద్ధం చేసుకోవాలి కదా’’ అని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించినట్లు తెలుస్తోంది. 


అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు పాల్గొనడం లేదని బీసీసీఐ జాయింట్ సెక్రటరీ జయేశ్ జార్జ్ స్పష్టం చేశారు. ‘‘ఆసియా ఎక్స్‌ఐలో పాకిస్థాన్ ఆటగాళ్లకి చోటు లేదు. కాబట్టి, రెండు దేశాలు కలిసి ఆడే ప్రస్తక్తి లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement