వైట్‌బాల్ క్రికెట్‌లో కోహ్లీనే అత్యుత్తమం: శ్రీలంక పేసర్

ABN , First Publish Date - 2021-01-15T23:22:40+05:30 IST

అబుదాబిలో ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు జరగనున్న ‘అబుదాబి టీ10’ లీగ్‌ రెండో సీజన్‌లో బంగ్లా టైగర్స్‌కు ఉడానా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

వైట్‌బాల్ క్రికెట్‌లో కోహ్లీనే అత్యుత్తమం: శ్రీలంక పేసర్

కొలంబో: వైట్‌బాల్ క్రికెట్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని శ్రీలంక పేసర్ ఇసురు ఉడానా పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లీ గత దశాబ్దకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ అత్యుత్తమ బౌలర్ అని ఉడానా చెప్పుకొచ్చాడు. లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్‌లో రవీంద్ర జడేజా టాప్ ఆల్ రౌండర్ అని ఉడానా వివరించాడు.


 ‘‘వైట్ బాల్ క్రికెట్‌లో కోహ్లీనే అత్యుత్తమని నా భావన. మిచెల్ స్టార్క్ బెస్ట్ బౌలర్. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే రవీంద్ర జడేజాది అగ్రస్థానం’’ అని మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. కాగా, టీమిండియా సారథి విరాట్ కోహ్లీని ఐసీసీ ఇటీవల ఈ దశాబ్దపు వన్డే ఆటగాడిగా ప్రకటించింది.


అబుదాబిలో ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు జరగనున్న ‘అబుదాబి టీ10’ లీగ్‌ రెండో సీజన్‌లో బంగ్లా టైగర్స్‌కు ఉడానా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇదో సరదా టోర్నమెంటు అని, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చని ఉడానా పేర్కొన్నాడు. ఈ లీగ్ బౌలర్లకు కొంత కష్టంగానే ఉంటుందన్నాడు. అయినప్పటికీ చాలా సరదాగా సాగుతుందన్నాడు. ఇందులో బంగ్లా టైగర్స్‌కు ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఉడానా పేర్కొన్నాడు. 



Updated Date - 2021-01-15T23:22:40+05:30 IST