Advertisement
Advertisement
Abn logo
Advertisement

కోహ్లీ చేసిన పనికి నెటిజన్ల ఫిదా

లండన్: నాలుగో టెస్టులో టీమిండియా విజయం సాధించిన అనంతరం ఓవల్ మైదానంలో జరిగిన ఓ చిన్న ఘటన సోషల్ మీడియాకెక్కి వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసినవారు టీమిండియా సారథి విరాట్ కోహ్లీని ప్రశంసించలేకుండా ఉండలేకపోతున్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, కోహ్లీ తిరిగి పెవిలియన్‌కు నడుచుకుంటూ వస్తున్నారు.


పెవిలియన్ మెట్ల మార్గంలో వారికి ఓ వాటర్ బాటిల్ కిందపడి కనిపించింది. అది చూసిన రూట్ దానిని తాకకుండా పక్కనుంచి వచ్చేయగా, ఆ బాటిల్‌ను గమనించిన కోహ్లీ దానిని తీసి చేత్తో పట్టుకుని పైకి తీసుకెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాకెక్కడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. రూట్ చేయని పనిని కోహ్లీ చేశాడని, వారిద్దరి మధ్య ఉన్న తేడాకు ఇదొక్కటే నిదర్శమని అభిమానులు కొనియాడుతున్నారు. 


Advertisement
Advertisement