పనసపండు కోఫ్తా కర్రీ

ABN , First Publish Date - 2021-07-15T19:00:48+05:30 IST

పనసపండు ముక్కలు- మూడు కప్పులు, టమోటా, ఉల్లి ముక్కలు- చెరో కప్పు, శనగ పిండి- అర కప్పు, పెరుగు- అర కప్పు, పచ్చి మిర్చి పేస్టు- స్పూను,

పనసపండు కోఫ్తా కర్రీ

కావలసిన పదార్థాలు: పనసపండు ముక్కలు- మూడు కప్పులు, టమోటా, ఉల్లి ముక్కలు- చెరో కప్పు, శనగ పిండి- అర కప్పు, పెరుగు- అర కప్పు, పచ్చి మిర్చి పేస్టు- స్పూను, అల్లం ముక్కలు- రెండు స్పూన్లు, ఉప్పు, నూనె- తగినంత, కారం పొడి- రెండు స్పూన్లు, పసుపు- అర స్పూను, గరం మసాలా, ధనియాల పొడి- చెరో స్పూను, కొత్తిమీర తురుము- రెండు స్పూన్లు.


తయారుచేసే విధానం: ముందుగా ఉప్పు వేసి పనసపండు ముక్కల్ని మెత్తగా ఉడికించాలి. నీటినంతా వడగట్టి పనసపండును గుజ్జులా చేసుకోవాలి. దీనికి శనగపిండి, కారప్పొడి, అల్లం ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి ఓ మోస్తరు ఉండలుగా చేసుకోవాలి. వీటిని ఓ పాన్‌లో బంగారు రంగులో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఓ పాన్‌లో కాస్త నూనె వేసి ఉల్లి ముక్కల్ని దోరగా వేయించాలి. ధనియాల పొడి, కారప్పొడి. గరం మసాలా, పసుపు వేసి కాస్త వేగాక టమోటా ముక్కల్ని వేసి ఓ మూడు నిమిషాలు వేగనివ్వాలి. ఆ తరవాత ముప్పావు కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. చల్లారాక ఈ మిశ్రమాన్నంతా మిక్సీలో పేస్టులా చేసుకోవాలి. దీన్నంతా పాన్‌లో వేసుకుని అరకప్పు నీళ్లు, పెరుగు కలిపి సన్నని మంటమీద ఓ నిమిషం ఉడికించాలి. దీంట్లోనే పనస కోఫ్తాలు వేసి బాగా కలిపి మూతపెట్టి ఓ రెండు నిమిషాలు ఉడికిస్తే కర్రీ రెడీ. పైన కొత్తిమీర తురుము జల్లితే సరి.

Updated Date - 2021-07-15T19:00:48+05:30 IST