అమరావతి: ఎన్టీఆర్ భవన్‌లో అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతిని నిర్వహించారు. కోడెల చిత్రపటానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కోడెలది ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ను నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోడెల తరహాలో ఎంతోమంది సీఎం జగన్‌రెడ్డి ప్రభుత్వ తీరుతో ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. నంద్యాలలో అబ్దుల్‌సలాం ఘటన మరో ఉదాహరణ అని చంద్రబాబు పేర్కొన్నారు.