నెల్లూరు జిల్లాలో అరాచక ఎస్ఐ

ABN , First Publish Date - 2021-06-20T18:51:59+05:30 IST

ఆయన ఇన్చార్జ్ ఎస్ఐ.. కానీ ఎక్కువగా అధికారపార్టీనేత గెస్ట్ హౌస్‌లోనే టైమ్ పాస్ చేస్తారు.

నెల్లూరు జిల్లాలో అరాచక ఎస్ఐ

నెల్లూరు జిల్లా: ఆయన ఇన్చార్జ్ ఎస్ఐ.. కానీ ఎక్కువగా అధికారపార్టీనేత గెస్ట్ హౌస్‌లోనే టైమ్ పాస్ చేస్తారు. ఎవరైనా ప్రశ్నిస్తే అడ్డదిడ్డంగా కేసులు పెడతారు. ఇంకేమైనా అంటే స్టేషన్‌కు తీసుకువచ్చి చితక్కొడతారు. నిబంధనలకు పాతరేస్తారు. ఆయన పేరు సుబ్బారావు, నెల్లూరు జిల్లా, కొడవలూరు ఇన్చార్జ్ ఎస్ఐ. కొడవలూరులో అడుగుపెట్టి సుబ్బారావు అని అంటే చాలు.. అందరూ అయ్యబాబోయ్ అంటారు. అది ఆయనగారి ట్రాక్ రికార్డు.


కొడవలూరు ఎస్సీ సెల్ నేత మల్లికార్జునపై గతంలో కేసులు ఉన్నాయి. ఆ కేసులు కోర్టులో కొట్టేశారు. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడు, చలపతి వర్గానికి మల్లికార్జునతో పాత గొడవలు ఉన్నాయి. మల్లికార్జునపై ఉన్న కేసులు కొట్టేయడంతో చలపతి వర్గం మరో ఎత్తుగడ వేసింది. ఎస్ఐ సుబ్బారావును అడ్డంపెట్టుకుని మల్లికార్జునపై రౌడీ షీట్ తెరిపించింది. అయితే కేసులు లేకుండా మల్లికార్జునపై రౌడీ షీటు ఎలా తెరుస్తారని అంతటా ఆగ్రహం వ్యక్తమైంది. ఈ తరుణంలోనే చలపతి వర్గీయులు బైకులపై వచ్చి మల్లికార్జునను అటకాయించారు. దాడి చేసి చితకబాదారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి అప్పగించారు. తిరిగి తమపై మల్లికార్జున దాడి చేశాడంటూ ఫిర్యాదు చేశారు. తనపై దాడి జరిగిందని మల్లికార్జున ఫిర్యాదు చేసినా ఎస్ఐ పట్టించుకోలేదు. మల్లికార్జునపై దాడి జరిగిన తీరు, అతనిపైనే కేసు పెట్టిన వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేతికందాయి.


మల్లికార్జునను పోలీస్ స్టేషన్‌లో మూడు, నాలుగు గంటలపాటు ఉంచారు. ఆ సమయంలో నిండు గర్భిణిగా ఉన్న ఆయన భార్య, స్థానికులు ఆందోళనకు దిగారు. టీడీపీ నేత కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి వారికి అండగా నిలిచారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో మల్లికార్జునను వదిలిపెట్టారు.

Updated Date - 2021-06-20T18:51:59+05:30 IST