తెలంగాణాలో విచిత్రమైన పరిస్థితి ఉంది: కోదండరెడ్డి

ABN , First Publish Date - 2021-12-06T20:15:37+05:30 IST

వానాకాలం పంట కోయక ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు చేయాలని కోదండరెడ్డి అన్నారు.

తెలంగాణాలో విచిత్రమైన పరిస్థితి ఉంది: కోదండరెడ్డి

హైదరాబాద్: వానాకాలం పంట కోయక ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు చేయాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కోతలు కోసి 50 రోజులు అవుతోందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ప్రణాలికలు చేయలేదని, తెలంగాణాలో విచిత్రమైన పరిస్థితి నెలకొందన్నారు. పార్లమెంట్, రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు గందరగోళం చేశారని.. మిగిలిన దాన్యం కొనుగోళ్లపై రైతులకు ఎటువంటి హామీలు ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు కేంద్రం కొనుగొలు చేయడం లేదంటున్నారని, చివరికి ధాన్యాన్ని దళారులకు అమ్మేలా చేశారని కోదండరెడ్డి దుయ్యబట్టారు. 

Updated Date - 2021-12-06T20:15:37+05:30 IST