కోదండరాముడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ABN , First Publish Date - 2021-04-21T05:02:36+05:30 IST

కోదండరాముని బ్రహ్మోత్సవా లు అంకురార్పణతో మంగళవారం సాయంత్రం ప్రారంభమ య్యాయి.

కోదండరాముడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
పుట్టమన్ను తీసుకొస్తున్న టీటీడీ అర్చకులు

నేడు ధ్వజారోహణం


ఒంటిమిట్ట, ఏప్రిల్‌ 20: కోదండరాముని బ్రహ్మోత్సవా లు అంకురార్పణతో మంగళవారం సాయంత్రం ప్రారంభమ య్యాయి. కరోనా నేపధ్యంలో బ్రహ్మో త్సవాలను ఆలయానికే పరిమితం చేశారు. బుధవారం వైష్ణవ సంప్రదాయం ప్రకారం అంకురార్పణ నిర్వహించారు. ముందుగా పుట్టమన్నును రామాలయంలోని పుట్టనుంచి సేకరించిన అర్చకులు స్వామి వారికి ప్రదక్షిణ చేశారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణల మధ్య సుగంధద్రవ్యాలను రామాలయంలోని ఉత్సవమూర్తులైన సీతారామలక్ష్మణులకు సమర్పించారు. అభిషేకం, అర్చన, కలశాభిషేకం నిర్వహించి పట్టువస్త్రాలను టీటీడీ డిప్యూటీ ఈవో రమేష్‌బాబు చేతుల మీదుగా స్వామికి సమర్పించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. భక్తులకు అనుమతి లేకుండా రామాల యంలో ఏకాంతంగా ఉత్సవాలను ఆగమ శాస్త్ర ప్రకారం టీటీడీ అర్చకులు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగం గా బుధవారం శ్రీరామనవమిని పురస్కరించుకొని ధ్వజారోహణం నిర్వహించనున్నారు.

Updated Date - 2021-04-21T05:02:36+05:30 IST