కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా లోపం

ABN , First Publish Date - 2022-08-03T05:50:20+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా లోపం

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా లోపం

 సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలి

 టీజేఎస్‌ అఽధ్యక్షుడు కోదండరాం

 లక్ష్మీపంప్‌హౌస్‌ పరిశీలనకు వెళ్తుండగా అరెస్టు చేసిన పోలీసులు

మహదేవపూర్‌, ఆగస్టు 2: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మా ణంలో నాణ్యత లోపించడం వల్లే పంప్‌హౌస్‌ ముంపు నకు గురైందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు. దీనిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వరద ఉధృతికి ముంపునకు గురైన భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన లక్ష్మీపంప్‌హౌస్‌ను మంగళవారం పరిశీలిం చేందుకు వచ్చిన ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. గోదావరి వరదతో పంటలు ముంపునకు గురైన అన్నారం రైతులను కలిసి పంప్‌హౌస్‌ వద్దకు వెళ్తున్న క్రమంలో కోదండరాం సహా ఆయన అనుచరులు, పార్టీ నాయకులు పంది మందిని కాళేశ్వరం సమీపం లో అరెస్టు చేశారు. దీనికి నిరసనగా కోదండరాం రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాటా ్లడుతూ వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి లోపాలు లేకుంటే తమను లక్ష్మీ పంప్‌హౌస్‌లోకి ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. నిర్మాణంలో నాణ్యతా లోపం వల్లే పంప్‌ హౌస్‌ నీటమునిగిందని అన్నారు.  భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఇప్పుడు మరమ్మతుల పేరిట మళ్లీ ప్రజాధనాన్ని వెచ్ఛించరాదన్నారు. కోదండరాం విలేక రులతో మాట్లాడిన అనంతరం ఆయనతోపాటు మరో పది మందిని పోలీసులు మహదేవపూర్‌ పోలీ స్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీక త్తుపై విడుదల చేశారు.


Updated Date - 2022-08-03T05:50:20+05:30 IST