దళితుల పట్ల ప్రభుత్వం వైఖరి మారాలి: కోదండరాం

ABN , First Publish Date - 2020-08-02T20:03:57+05:30 IST

దళితుల పట్ల ప్రభుత్వం తన వైఖరిని విడనడాలని, దళితులపై దాడులు..

దళితుల పట్ల ప్రభుత్వం వైఖరి మారాలి: కోదండరాం

సిద్దిపేట జిల్లా: దళితుల పట్ల ప్రభుత్వం తన వైఖరిని విడనడాలని, దళితులపై దాడులు, భూమి గుంచుకోవడం వంటి చర్యలను మానుకోవాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఆదివారం వర్గల్ మండలం వేలూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నర్సింహులు కుటుంబాన్ని ఆయన పరామర్శించి, ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నర్సింహులు మృతికి టీజేఎస్ తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నామన్నారు.


ప్రభుత్వం ఇచ్చిన భూమిని ప్రభుత్వమే తీసుకుంటుందని, బెదిరించి తీసుకోవడం సమంజసం కాదని కోదండరాం అన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇయ్యక పోగా ఉన్నది గుంజుకోవడం బాధాకరమన్నారు. భూమికి భూమి ఇయ్యమని నర్సింహులు చెప్పినా  వినకుండా భూమిని లాక్కోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని విచారం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలకు కూడా పోలీసులు అడ్డుపడడం సిగ్గుచేటన్నారు. ఆరేళ్లలో ప్రభుత్వం ఇచ్చింది 15 వేల ఎకరాలని వాళ్లే ఒప్పుకున్నారన్నారు. కానీ సేకరించింది సుమారు రెండు లక్షల ఎకరాలన్నారు. భూ సేకరణలో అత్యధిక భాగం దళితులదేనని కోదండరాం వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-08-02T20:03:57+05:30 IST