కొడనాడు కేసులో జయ సహాయకుడి వద్ద విచారణ

ABN , First Publish Date - 2022-04-30T12:58:01+05:30 IST

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో దోపిడీ, సెక్యూరిటీ గార్డు హత్య కేసు విచారణ వేగంపుంజుకుంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే

కొడనాడు కేసులో జయ సహాయకుడి వద్ద విచారణ

అడయార్‌(చెన్నై): దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో దోపిడీ, సెక్యూరిటీ గార్డు హత్య కేసు విచారణ వేగంపుంజుకుంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే పలువురిని విచారిం చారు. ఈ నేపథ్యంలో జయ దగ్గర సుధీర్ఘకాలం సహాయకుడిగా పనిచేసిన పూంగుండ్రంను పోలీసు అధికారులు శుక్రవారం విచారణ జరిపారు. ఈ కేసు విచారణలో భాగంగా, ఈయనకు అధికారులు సమన్లు జారీచేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో కోయంబత్తూరులోని పీఆర్‌ఎస్‌ మైదానంలోని విచారణ కార్యాలయానికి వచ్చారు. ఐజీ సుధాకర్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఆయనను విచారించింది. జయ మృతి కేసులో జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ ఎదుట కూడా పూంగుండ్రం హాజరయ్యారు. జయ వద్ద చాలా సంవత్సరాల పాటు వ్యక్తిగత సహాయకుడుగా ఉండటంతో ఆమెకు సంబంధించిన అనేక విషయాలను ఆయన చక్కబెట్టేవారు. అందువల్ల పోయెస్‌ గార్డెన్‌, కొడనాడు ఎస్టేట్‌కు సంబంధించిన విషయాలు, రహస్యాలు అతనికి తెలిసివుంటాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే అతడిని విచారిస్తున్నారు.

Updated Date - 2022-04-30T12:58:01+05:30 IST