Kodanadu: కొడనాడు కేసు విచారణాధికారిగా షకీల్‌ అక్తర్‌

ABN , First Publish Date - 2022-10-07T13:13:52+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి జయలలిత వేసవి విడిది కేంద్రం కొడనాడు ఎస్టేట్‌ వద్ద జరిగిన వాచ్‌మెన్‌ హత్య, దోపిడీ కేసుల విచారణాధికారిగా సీనియర్‌ ఐపీఎస్‌

Kodanadu: కొడనాడు కేసు విచారణాధికారిగా షకీల్‌ అక్తర్‌

చెన్నై, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జయలలిత వేసవి విడిది కేంద్రం కొడనాడు ఎస్టేట్‌ వద్ద జరిగిన వాచ్‌మెన్‌ హత్య, దోపిడీ కేసుల విచారణాధికారిగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి షకీల్‌ అక్తర్‌(Shakeel Akhtar)ను  ప్రభుత్వం నియమించింది. ఇటీవలే ఈ కేసుల విచారణను ప్రభుత్వం సీబీసీఐడీకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. 2017లో జరిగిన కొడనాడు(Kodanadu) ఎస్టేట్‌ వద్ద వాచ్‌మెన్‌ హత్య, ఆ తర్వాత దోపిడీ సంఘటన, సీసీ  కంట్రోల్‌ రూమ్‌ ఉద్యోగి ఆత్మహత్య తదితర సంఘటనలపై విచారణ జరుగుతోంది. ఈ కేసులకు సంబంధించిన పది మంది నిందితులు ప్రస్తుతం బెయిలుపై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఈ కేసుల విచారణాధికారిగా షకీల్‌ అక్తర్‌ను నియమించడంతో  విచారణ ఊపందుకోనుంది.

Updated Date - 2022-10-07T13:13:52+05:30 IST