ఎక్కడివారు.. అక్కడే

ABN , First Publish Date - 2020-03-29T09:27:34+05:30 IST

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లాక్‌డౌన్‌ ఉత్తర్వులు అందరూ పాటించాల్సిందేనని, ఎక్కడి వారు అక్కడ ఉండాలని పౌర సరఫరా, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) అన్నారు.

ఎక్కడివారు.. అక్కడే

రాజస్థాన్‌ వ్యాపారులతో మంత్రి కొడాలి నాని 


గుడివాడ, మార్చి 28: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లాక్‌డౌన్‌ ఉత్తర్వులు అందరూ పాటించాల్సిందేనని, ఎక్కడి వారు అక్కడ ఉండాలని పౌర సరఫరా, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) అన్నారు.  రాజేంద్రనగర్‌లోని తన స్వగృహంలో మంత్రి నానిని రాజస్థాన్‌కు చెందిన కొంత మంది వ్యాపారులు శనివారం కలిశారు. తమ రాష్ట్రం వెళ్లేందుకు  మినీబస్సు ఏర్పాటు చేసుకున్నామని, చెక్‌పోస్టుల వద్ద ఆపకుండా ఎన్‌వోసీ ఇప్పించాలని కోరారు. దానికి మంత్రి స్పందిస్తూ ప్రతిఒక్కరూ లాక్‌డౌన్‌లో ఉండాల్సిందేనన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. ఇళ్లు లేనివారికి ప్రభుత్వమే ఆశ్రయం కల్పించి భోజన సదుపాయం కల్పిస్తోందని వారికి వివరించారు. మాజీ కౌన్సిలర్‌ పి.వి.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-29T09:27:34+05:30 IST