అమరావతి: మంత్రి కొడాలి నాని అంటేనే సంఘ విద్రోహ శక్తి అని టీడీపీ నేత వర్లరామయ్య దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుడివాడ ఘటనపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. పోలీసులు తకు పర్మిషన్ ఇచ్చి వైసీపీ వారికి కొమ్ముకాశారని ఆరోపించారు. వైసీపీ వారికి ఎందుకు గుడివాడలో అనుమతిచ్చారు? అని ప్రశ్నించారు. తాము వస్తుంటే వైసీపీ వారిని ఎందుకు గృహ నిర్బంధం చేయలేదని నిలదీశారు. వ్యవస్ధను నాశనం చేసిన మంత్రి, ఇతరులపై చర్యలు తీసుకోవాలని వర్లరామయ్య డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి