సినిమాకు నష్టం వస్తే నిర్మాత నష్టపోతారు.. పవన్ కాదు: కొడాలి నాని

ABN , First Publish Date - 2022-02-27T17:12:45+05:30 IST

సినిమాకు నష్టం వస్తే నిర్మాత నష్టపోతారు.. పవన్ కాదని మంత్రి కొడాలి నాని అన్నారు.

సినిమాకు నష్టం వస్తే నిర్మాత నష్టపోతారు.. పవన్ కాదు: కొడాలి నాని

అమరావతి: సినిమాకు నష్టం వస్తే నిర్మాత నష్టపోతారు.. పవన్ కాదని మంత్రి కొడాలి నాని అన్నారు.  ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం భీమ్లానాయక్‌కు ప్రత్యేక షరతులు ఏం పెట్టలేదని, సినిమాలన్నింటికి ఒకే రకమైన షరతులుంటాయన్నారు. జగన్‌ దగ్గర చిరంజీవి విన్నపాన్ని ఉద్దేశించి పవన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. చిరంజీవి దండాలు పెడితే.. జగన్ ఇగో సంతృప్తి చెందుతుందని ఎలా అంటారు?అని ప్రశ్నించారు.సినీ పెద్దలతో సీఎంను కలిసేందుకు చిరంజీవి వచ్చారన్నారు. గేటు దగ్గర నుంచి చిరంజీవిని నడిపించారని మాట్లాడుతున్నారు, మంత్రులు కూడా గేటు దగ్గర నుంచి నడుచుకుంటూనే వెళ్తారన్నారు. ప్రతి ఒక్కరిని గౌరవించే వ్యక్తి చిరంజీవి అని తెలిపారు. సినీ పరిశ్రమకు మేలు చేసేందుకు ప్రభుత్వ సహాయం కావాలని.. సీఎం జగన్మోహన్‌రెడ్డిని చిరంజీవి దండం పెట్టి కోరితే ఈ దుర్మార్గులు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌కు కుతంత్రాలు తెలీదు.. జగన్ అందరివాడన్నారు. సినీ పరిశ్రమ ఇలా ఉండడానికి చంద్రబాబే కారణమని కొడాలి నాని మండిపడ్డారు.

Updated Date - 2022-02-27T17:12:45+05:30 IST