కొడైకెనాల్‌లో విరబూసిన కుసుమాలు

ABN , First Publish Date - 2022-05-25T14:48:22+05:30 IST

పర్వతాల యువరాణి కొడైకెనాల్‌ సిగలో పుష్పం విరబూసింది. పర్యాటకుల్ని ఇట్టే కట్టిపడేసే ప్రకృతి సొబగులు, విరబూసిన పుష్పాలు వెదజల్లే సువాసనలతో కొడైకెనాల్‌ సిగ్గుల

కొడైకెనాల్‌లో విరబూసిన కుసుమాలు

                             - పుష్ప ప్రదర్శన ప్రారంభం


చెన్నై: పర్వతాల యువరాణి కొడైకెనాల్‌ సిగలో పుష్పం విరబూసింది. పర్యాటకుల్ని ఇట్టే కట్టిపడేసే ప్రకృతి సొబగులు, విరబూసిన పుష్పాలు వెదజల్లే సువాసనలతో కొడైకెనాల్‌ సిగ్గుల మొగ్గైంది. ఎటు చూసినా అరుదైన కుసుమాలు, పచ్చని పర్యావరణంతో ‘ఓహో’ అనిపిస్తోంది. మంగళవారం ప్రారంభమై కొడైకెనాల్‌లో 59వ పుష్ప ప్రదర్శనలో ఈ అద్భుత సౌందర్యాలు ప్రకృతి కాన్వాస్‌పై ఆవిష్కృతం అయి సందర్శకులను కట్టిపడేస్తున్నాయి.   



Updated Date - 2022-05-25T14:48:22+05:30 IST