Rose Park: కొడైకెనాల్‌కు పోటెత్తిన పర్యాటకులు

ABN , First Publish Date - 2022-08-16T14:21:37+05:30 IST

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కొడైకెనాల్‌కు పర్యాటకులు ఒక్కసారిగా పోటెత్తారు. శనివారం నుంచి సోమవారం వరకు వరుస సెలువులు రావడంతో

Rose Park: కొడైకెనాల్‌కు పోటెత్తిన పర్యాటకులు

అడయార్‌(చెన్నై), ఆగస్టు 15: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కొడైకెనాల్‌కు పర్యాటకులు ఒక్కసారిగా పోటెత్తారు. శనివారం నుంచి సోమవారం వరకు వరుస సెలువులు రావడంతో పర్యాటకులు ఇక్కడకు తరలివచ్చారు. దీంతో కొడైకెనాల్‌ బోటింగ్‌ చెరువుతో పాటు రోజా పార్కు(Rose Park), బ్రియాంట్‌ పార్క్‌ తదితర ప్రాంతాలు పర్యాటకుల రద్దీతో సందడిగా కనిపించాయి. పర్యాటకుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో ఇక్కడ ఉన్న కాటేజీలకు రోజు వారీ అద్దె రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేసినట్టు బాధిత పర్యాటకులు వెల్లడించారు. 

Updated Date - 2022-08-16T14:21:37+05:30 IST