బ్రయంట్‌ టవల్‌ @ రూ.25 లక్షలు

ABN , First Publish Date - 2020-03-31T10:13:10+05:30 IST

బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబి బ్రయంట్‌కు చెందిన టవల్‌కు భారీ ధర పలికింది. 2016లో లాస్‌ఏంజిల్స్‌ లేకర్స్‌ తరఫున చివరి ఎన్‌బీఏ మ్యాచ్‌ ఆడిన బ్రయంట్‌ చివర్లో ...

బ్రయంట్‌ టవల్‌ @ రూ.25 లక్షలు

లాస్‌ఏంజిల్స్‌: బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబి బ్రయంట్‌కు చెందిన టవల్‌కు భారీ ధర పలికింది. 2016లో లాస్‌ఏంజిల్స్‌ లేకర్స్‌ తరఫున చివరి ఎన్‌బీఏ మ్యాచ్‌ ఆడిన బ్రయంట్‌ చివర్లో అభిమానులను ఉద్దేశించి మాట్లాడాడు. ఆ సమయంలో చెమటను తుడుచుకునేందుకు భుజంపై టవల్‌ వేసుకున్నాడు. ఆదివారం ఆన్‌లైన్‌లో జరిగిన వేలంలో అదే టవల్‌ను లేకర్స్‌ వీరాభిమాని ఒకరు 33 వేల డాలర్ల (రూ.25 లక్షలు)కు కొనుగోలు చేశాడు. ఈ జనవరిలో బ్రయంట్‌తో పాటు అతడి కుమార్తె హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందారు.

Updated Date - 2020-03-31T10:13:10+05:30 IST