ప్రజలకు చట్టాల గురించి వివరిస్తున్న తంబళ్లపల్లె సివిల్ కోర్టు న్యాయమూర్తి భరత్ చంద్ర
తంబళ్లపల్లె, జూలై 2: సమాజంలో జరుగుతున్న పరిణామాలను గమని స్తూ మహిళలు, యువకులు, పెద్దలు చట్టాలపై అవగాహన పెంచుకో వాల్సిన అవసరం ఉందని తంబళ్లపల్లె జూనియర్ సివిల్ కోర్టు న్యాయ మూర్తి భరత్ చంద్ర పేర్కొన్నారు. శనివారం తంబళ్లపల్లె కోర్టు పరిధిలో ని ములకలచెరువు మండలం ఉమాశంకర్ కాలనీలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చట్టాలు, అవి కల్పించే రక్షణ, పాటించవలసిన నియమాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ చట్టం నుంచి తగిన రక్షణ పొందే అవకాశం ఉందన్నారు. చట్టాలపై అవగాహన కలిగి ఉంటే వివాదాలు తలెత్తే అవకాశం ఉండబోదని స్పష్టం చేశారు. పిల్లలు చెడు అలవాట్లకు లోను కాకుండా తల్లితం డ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, సూచించారు. సమావేశంలో కోర్టు సిబ్బంది అరవింద్, గురుప్రసాద్, పోలీసు, మండల న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.