Bill Gates ముద్దుల కూతురు Jennifer Gates ను పెళ్లి చేసుకున్న Nayel Nassar బ్యాక్‌గ్రౌండ్ ఇదీ.. ఆస్తి ఎంతంటే..

ABN , First Publish Date - 2021-10-20T23:51:58+05:30 IST

బిల్, మిలిండా గేట్స్ పెద్ద కుమార్తె జెన్నీఫర్ గేట్స్ వివాహం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన జెన్నీఫర్ గేట్స్ వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ వివాహం గురించి ఆరా తీస్తున్నారు. జెన్నీఫర్ గేట్స్‌ది లవ్ మ్యారేజా లేక అరేంజ్ మ్యారేజా? ప్రపంచ కు

Bill Gates ముద్దుల కూతురు Jennifer Gates ను పెళ్లి చేసుకున్న Nayel Nassar బ్యాక్‌గ్రౌండ్ ఇదీ.. ఆస్తి ఎంతంటే..

ఇంటర్నెట్ డెస్క్: బిల్, మిలిండా గేట్స్ పెద్ద కుమార్తె జెన్నీఫర్ గేట్స్ వివాహం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన జెన్నీఫర్ గేట్స్ వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ వివాహం గురించి ఆరా తీస్తున్నారు. జెన్నీఫర్ గేట్స్‌ది లవ్ మ్యారేజా లేక అరేంజ్ మ్యారేజా? ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ గారాల పట్టి జెన్నీఫర్‌ గేట్స్‌ని పెళ్లాడిన ఆ యువకుడు ఎవరు? ఏం చేస్తుంటాడు? అతడికి ఎంత ఆస్తి ఉంది? అనే వివరాలపై తీవ్రంగా సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ వివరాలు మీ కోసం..



బిల్ గేట్స్ ముద్దుల కూతురు జెన్నీఫర్ గేట్స్‌ను వివాహం చేసుకున్న యువకుడి పేరు నాయల్ నాసర్. ఈయన ఈజిప్టియన్ అమెరికన్. జనవరి 21, 1991లో చికాగోలో పుట్టిన నాయల్.. చిన్నతనంలోనే కువైత్‌కు వెళ్లి అక్కడే పెరిగారు. అనంతరం 2009లో తిరిగి కాలిఫోర్నియాకు వచ్చారు. కాగా.. చిన్నప్పటి నుంచే నాయల్‌కు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే అతడు శిక్షణ తీసుకుని.. ఇక్వస్టియన్, షో జంపర్ మంచి గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలోనే 2013, 2014, 2017 సంవత్సరాల్లో ఫెడరేషన్ ఈక్వెస్టర్ ఇంటర్నెషనల్ (ఎఫ్ఈఐ) ప్రపంచ కప్ ఫైనల్స్‌కు నాయల్ అర్హత సాధించారు. అంతేకాకుండా అతడు.. పారిస్‌లో జరిగిన లాంగైన్స్ ఎఫ్ఈఐ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో పాల్గొన్నారు. అలాగే, ఫిబ్రవరి 2019లో, 38.15 సెకన్లలో రేసును పూర్తి చేసి లాంగిన్స్ ఎఫ్ఈఐ వరల్డ్ కప్ జంపింగ్‌లో కప్ గెలిచారు. అంతకుముందు, 2012లో నాయల్.. వింటర్ ఈక్వెస్ట్రియన్ ఫెస్టివల్‌లో ఆర్టిసాన్ ఫార్మ్స్ యంగ్ రైడర్ గ్రాండ్ ప్రిక్స్ సిరీస్‌ను గెలుచుకున్నారు. 



అరబిక్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషలను అనర్గళంగా మాట్లాడే నాయల్.. 2014లో నాసర్ స్టేబుల్స్ ఎల్ఎల్‌సీ అనే పేరు మీద కాలిఫోర్నియాలో ఓ కంపెనీని స్థాపించారు. అంతకుముందు  2011 నుంచే నాయల్.. కువైత్‌లో ‘దివాన్ ఇంటీరియర్ ఇంటర్నేషనల్’ అనే ఇంటీరియర్ అండ్ ఆర్కిటెక్చర్ డిసైన్ కంపెనీ నెలకొల్పి దానిలో లాభాలు ఆర్జిస్తున్నారు. నాయల్ వేతనంగా ఏడాదికి 5 మిలియన్ డాలర్లను అందుకుంటుండగా.. అతడి నికర ఆస్తుల విలువ 100 మిలియన్ డాలర్ల వరకూ ఉన్నట్లు సమాచారం. 


ఇదిలా ఉంటే.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో హ్యూమన్ బయాలజీ సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన జెన్నీఫర్‌కు గుర్రపు స్వారీ అంటే ఇష్టం. దీంతో ఆమె తన చదువుకు కొద్ది రోజులపాటు బ్రేక్ ఇచ్చి.. ఇక్వస్ట్రియన్‌గా మారడానికి శిక్షణ తీసుకున్నారు. ఈ క్రమంలోనే స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలోనే ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన నాయల్‌తో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారడంతో.. తమ కుటుంబ సభ్యులను ఒప్పంచి శనివారం రోజు బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఉత్తర సేలంలోని 142 ఎకరాల ఎస్టేట్‌‌లో 300 మంది అతిథుల సమక్షంలో జరిగిన జెన్నీఫర్ గేట్స్ వివాహానికి బిల్, మిలిందా గేట్స్ కూడా హాజరయ్యారు. 




Updated Date - 2021-10-20T23:51:58+05:30 IST