మద్యం మనిషికి ఎలా అలవాటైంది? ఒక సీసా వైన్‌కు ఎన్ని ద్రాక్ష పండ్లు అవసరం?... ఇలాంటి విషయాలు మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-01-19T13:02:17+05:30 IST

ఆల్కహాలిక్ డ్రింక్స్ మత్తును కలిగిస్తాయనే విషయం..

మద్యం మనిషికి ఎలా అలవాటైంది? ఒక సీసా వైన్‌కు ఎన్ని ద్రాక్ష పండ్లు అవసరం?... ఇలాంటి విషయాలు మీకు తెలుసా?

ఆల్కహాలిక్ డ్రింక్స్ మత్తును కలిగిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే! అయితే మద్యానికి సంబంధించిన పలు వాస్తవాలు గురించి చాలామందికి తెలియదు. మద్యం తాగేవారు లేదా మద్యం తాగనివారికి కూడా అంతగా తెలియని ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హెల్త్‌లైన్ తెలిపిన వివరాల ప్రకారం ఎన్ఎస్డీహెచ్‌యూ అందించిన డేటా వివరాలు చూస్తే.. 86.4 శాతం మంది పెద్దలు ఏదోఒక సమయంలో మద్యం సేవించి ఉంటారు. మెదడులో డోపమైన్‌ను విడుదల చేయడంతో సహా శరీరంలో ఆల్కహాల్ అనేక రకాల ప్రభావాలను చూపిస్తుంది. ఇది సంతృప్తికర అనుభవాన్ని కలిగేలా చేస్తుంది. స్త్రీల కంటే పురుషులు అధికంగా మద్యం సేవిస్తారు. ఇక్కడ విశేషమేమిటంటే మద్యం తక్కువ సమయంలోనే మహిళలకు హాని కలిగిస్తున్నట్లు తేలింది. మద్యం అనేది పురుషులను, స్త్రీలను వేర్వేరుగా ప్రభావితం చేస్తుంది. నాటి రోజుల్లో గిజా పిరమిడ్‌లను నిర్మించే కార్మికులకు బీరు రూపంలో వేతనాలు ఇచ్చేవారట. మద్యం అలవాటుకు చాలా చరిత్ర ఉన్నదని ఈ రిపోర్టు చెబుతోంది. రెడ్ వైన్, విస్కీ వంటి డార్క్ లిక్కర్లు హ్యాంగోవర్ సమస్యలను కలిగిస్తాయి.


కొన్నిసందర్బాల్లో మద్యం సేవించడం అస్సలు మంచిదికాదు. సరైన పద్ధతిలో సేవిస్తే మద్యం హానికరం కాదనే ప్రచారం అస్సలు సరైనది కాదు. ప్రపంచంలోనే అత్యంత స్ట్రాంగ్ అయిన బీర్‌లో 67.5 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఒక సీసా వైన్ తయారు చేసేందుకు కనీసం 600 ద్రాక్ష పండ్లు అవసరమవుతాయి. వోడ్కాను నిల్వ ఉంచడానికి మైనస్ 16.51 ఫారెన్ హీట్ డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. విస్కీ వాసన ద్వారా కూడా మంచి నిద్ర పొందవచ్చని పలు పరిశోధనల్లో తేలింది. ఆల్కహాల్‌ను పలు ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు. ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం వల్ల క్యాన్సర్ ముప్పు 30శాతం వరకూ తగ్గుతుందని పలు పరిశోధనలు తేల్చిచెప్పాయి. ఖాళీ కడుపుతో మద్యం తాగితే 3 రెట్లు ఎక్కువ మత్తు కలుగుతుంది. ఆహారంతో పాటు మద్యం తాగడం ఆలస్యంగా మత్తును కలిగిస్తుంది.



Updated Date - 2022-01-19T13:02:17+05:30 IST