కొండల నడుమ వేడి నీటి బుగ్గలు ఎలా ఏర్పడుతాయి? ఇదేమన్నా ప్రకృతి చేసే మాయా?

ABN , First Publish Date - 2022-01-19T14:03:50+05:30 IST

కొండల నడుమ వేడి నీటి బుగ్గలు లేదా చెరువులు..

కొండల నడుమ వేడి నీటి బుగ్గలు ఎలా ఏర్పడుతాయి? ఇదేమన్నా ప్రకృతి చేసే మాయా?

కొండల నడుమ వేడి నీటి బుగ్గలు లేదా చెరువులు ఉంటాయనే సంగతి మీకు తెలిసేవుంటుంది. వాటిలోని నీరు వేడిగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇటువంటి చోట్ల గోరువెచ్చని నీరే కాదు.. చాలాచోట్ల వేడినీరు కూడా వస్తుందని వినేవుంటాం. ఆ నీటిలో చేతులు పెట్టలేనంత వేడి ఉంటుందని కూడా చెబుతుంటారు. ఆ నీటిని వాడుకునే సమీప ప్రాంతాలవారు ముందుగా ఆ నీటిని ఒక పాత్రలోకి తీసుకుని, చల్లబరిచాక వాడుకుంటారు. అయితే ఇప్పుడు మనముందున్నప్రశ్న ఏమిటంటే.. ఈ వేడి నీరు.. కొండలు లేదా పర్వతాలకు ఎక్కడ నుండి వస్తుంది. పర్వతాలలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ అక్కడ లభించే నీరు ఎందుకు వేడిగా ఉంటుంది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. లడఖ్ ప్రాంతంలోని సియాచిన్ గ్లేసియర్ దగ్గర నుబ్రా లోయలో పనామిక్ అనే చిన్న గ్రామం ఉంది.


ఇది లేహ్ నుండి 150 మీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 10,442 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడికి చెందిన ఒక ప్రదేశంలో వేడి నీరు వస్తుంది. ఈ నీటిలో చేయిపెడితే కాలిపోతుంది. ఈ ప్రాంత ప్రజలు ఈ నీటిని చల్లార్చిన అనంతర వినియోగిస్తారు. ఈ నీటిలో శరీరానికి మేలు చేసే అంశాలు చాలా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఇక్కడి వేడి నీటి వెనుక కారణాన్ని తెలుసుకోవాలంటే అక్కడి భౌగోళిక పరిస్థితుల గురించి ముందుగా తెలుసుకోవాలి. భూమి లోపలికి వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. అక్కడ శిలాద్రవం అంటే ఒక ప్రత్యేకమైన కరిగిన శిల కనిపిస్తుంది. ఈ శిలాద్రవం భూమిలోని అనేక పొరల కింద ఉంటుంది. కొన్నిసార్లు భూమిలోని ఈ పొరలలో పగుళ్లు ఏర్పడిన కారణంగా ఆ ద్రవం బయటకు రావడం ప్రారంభమవుతుంది. అది బయటకు వచ్చినప్పుడు ఇతర రాళ్ళతో కలుస్తుంది. వాటిని వేడిగా మారుస్తుంది. ఫలింగా ఆ రాళ్ళు చాలా వేడిగా మారుతాయి. దీనితో పాటు అక్కడ ఉన్న నీరు కూడా వేడిగా మారుతుంది.  ఆ నీరు భూమి నుండి బయటకు వచ్చినప్పుడు చాలా వేడిగా ఉంటుంది. ఆ నీరు బయటకు వచ్చి నీటి బుగ్గలు, చెరువులను ఏర్పరుస్తుంది. అందుకే ఆ నీరు వేడిగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు అగ్నిపర్వత ప్రాంతాలలో ఎక్కవగా కనిపిస్తాయి. వేడి లావా కారణంగా అక్కడి నీరు వేడిగా మారుతుంది. 



Updated Date - 2022-01-19T14:03:50+05:30 IST