పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

ABN , First Publish Date - 2020-11-01T11:38:19+05:30 IST

నగరంలో తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి, కలెక్టర్‌ వీరపాండియన్‌ శనివారం పరిశీలించారు.

పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

కర్నూలు(అర్బన్‌), అక్టోబరు 31: నగరంలో తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లను  ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి, కలెక్టర్‌ వీరపాండియన్‌ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈనెల 20 నుంచి డిసెంబరు 1 వరకు జిల్లాలో జరిగే తుంగభద్ర పుష్కరాల పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ రూ.230 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా  అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అంతకుముందు నంద్యాల చెక్‌ పోస్టు నుంచి వేసిన ఆర్‌అండ్‌బీ రోడ్లను, సంకల్‌ బాగ్‌, రాఘవేంద్రమట్‌, పంప్‌ హౌస్‌, మునగాలపాడు, సుంకేసుల డ్యామ్‌ వద్ద పుష్కరాల ఘాట్ల నిర్మా ణ పనులు, డ్రైనేజీ, తదితర పనులను మంత్రి పరిశీలించారు. ఎంపీ డా.సంజీవ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు హఫీజ్‌ ఖాన్‌, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, డాక్టర్‌ సుధాకర్‌, జేసీ రవిపట్టన్‌శెట్టి, కమిషనర్‌ డీకే బాలాజీ ఉన్నారు. 

Updated Date - 2020-11-01T11:38:19+05:30 IST