Abn logo
Nov 1 2020 @ 06:05AM

బైకును ఢీకొట్టిన ఆటో

బాలుడి మృతి, మరొకరికి తీవ్రగాయాలు 


ఎమ్మిగనూరు, అక్టోబరు 31: మండలంలోని కందనాతి, కడివెళ్ల గ్రామాల మధ్య శనివారం బైకును ఆటో ఢీకొట్టడంతో చరణ్‌ (15) మృతి చెందాడు. వివరాల మేరకు.. చరణ్‌, ఆశీర్వాదం కడివెళ్లకు బైక్‌పై వెళ్తూ దారిమధ్యలో కొద్దిసేపు రోడ్డుపక్కన నిల్చున్నారు. అదే సమయంలో గోనెగండ్ల మండలం అగ్రహారం గ్రామానికి చెందిన ఆటో ఎమ్మినూరు నుంచి ఆగ్రహా రానికి వెళ్తూ అదుపు తప్పి రోడ్డుపక్కన నిల్చున్న వారిని ఢీకొట్టింది. చరణ్‌ అక్కడికక్కడే మృతి చెందగా ఆశీర్వాదం గాయపడ్డాడు. స్థాని కులు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి అనంతరం మెరుగైన చికిత్సకు కర్నూలుకు తరలించారు. రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement