కర్నూలులో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం
కర్నూలు (కల్చరల్), అక్టోబరు 26: దసరా మహోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో దసరా మహాత్సవాలు సందడి లేకుండా మొదలయ్యాయి. కర్నూలులోని వివిధ ఆలయాల్లో నెలకొల్పిన 44 దుర్గామాత విగ్రహాలను సోమవారం సాయంత్రం స్థానిక సంకల్‌బాగ్‌లో తుంగభద్ర నది ఒడ్డున దుర్గాఘాట్‌లో, కేసీ కెనాల్ సమీపంలోని వినాయక ఘాట్‌లో నిమజ్జనం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ హాజరయ్యారు. తొలివిగ్రహానికి పూజలు నిర్వహించి క్రేన్ మీదుగా తుంగభద్రమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు. అంతకుముందు మహిళలు కలశాలతో చేపట్టిన శోభాయాత్ర ఆకట్టుకుంది. కార్యక్రమంలో నగర డీఎస్పీ వెంకట్రామయ్య, టూటౌన్ సీఐ మహేశ్వరరెడ్డి, వీహెచ్‌పీ నాయకులు కె. క్రిష్టన్న, సందడి మహేష్, మాజీ కార్పొరేటర్లు విఠల్‌శెట్టి, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మధురకవి ఎలమర్తి రమణయ్య వ్యవహరించారు.