న్యాయం చేయండి

ABN , First Publish Date - 2020-10-27T10:53:44+05:30 IST

అది నిరుపేదకుటుంబం. నాలుగేళ్ల క్రితం దౌర్జన్యంగా ఇంటికి తాళం వేశారు. దీంతో ఆ కుటుంబం వీఽధిన పడాల్సివచ్చింది. వారు కలెక్టర్‌, ఎస్పీ, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా రాజకీయ ఒత్తిళ్లతో అది చెత్తబుట్టకు చేరింది.

న్యాయం చేయండి

 ఇంటికి తాళం వేయడంతో వీధినపడ్డ కుటుంబం 

నాలుగేళ్లుగా న్యాయం కోసం పోరాటం


పాణ్యం, అక్టోబరు 26 : అది నిరుపేదకుటుంబం. నాలుగేళ్ల క్రితం దౌర్జన్యంగా ఇంటికి తాళం వేశారు. దీంతో ఆ కుటుంబం వీఽధిన పడాల్సివచ్చింది. వారు కలెక్టర్‌, ఎస్పీ, స్థానిక పోలీసులకు  ఫిర్యాదు చేసినా రాజకీయ ఒత్తిళ్లతో అది చెత్తబుట్టకు చేరింది.  సోమవారం బాధితులు స్థానిక పోలీసు స్టేషన్‌లో మరోసారి ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరారు.  పాణ్యం గ్రామానికి చెందిన కమ్ము సాహెబ్‌ 1968 ఫిబ్రవరి 24 న ఉప్పరి పేటలో స్థలం కొని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. 1986లో పాణ్యం గ్రామ పంచాయతీ అనుమతితో ఇల్లు నిర్మించుకున్నాడు. అప్పటి నుంచి ఇంటిపన్ను, విద్యుత్‌పన్ను చెల్లిస్తునే ఉన్నారు. 2015 మే 27 న కమ్ముసాహెబ్‌ మృతి చెందాడు. ఆ తర్వాత గతంలో ఆ స్థలం అమ్మిన వారి  బంధువులు దౌర్జన్యంగా ఆక్రమించడానికి ప్రయత్నించారు. 2016లో ఇంటికి తాళం వేసుకున్నారు.


ఆ సమయలో వేరే ఊరికి వెళ్లిన కమ్ముసాహెబ్‌ భార్యా, కొడుకులు, కోడళ్లు  పోలీసు స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. అయితే పోలీసులు నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గారని బాఽధితులు ఆరోపిస్తున్నారు. దీంతో బాఽధితులు కలెక్టర్‌, ఎస్పీ లకు ఫిర్యాదు చేశారు. అయినా ఇంత వరకు న్యాయం జరుగ లేదని తెలిపారు. మరోమారు పోలీస స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో సమస్య మొదటికి వచ్చినట్లయింది.  దీనిపై ఏఎస్‌ఐ బాషా మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదు మేరకు విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు తన దృష్టికి రాలేదన్నారు. 

Updated Date - 2020-10-27T10:53:44+05:30 IST