గంగమ్మ ఆలయంలో చోరీ

ABN , First Publish Date - 2020-09-29T10:55:37+05:30 IST

మండల పరిధిలోని చింతలచెరువు గ్రామంలో ఆదివారం రాత్రి గంగమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలో హుండీతో పాటు అమ్మవారికి అలంకరించే 14 వెండి గొడుగుల, వెండి వడ్డానం, కిరీటాన్ని చోరీ చేశారు. సుమారు రూ.52 వేల విలువ చేసే వెండి ఆభరణాలు మాయమయ్యాయి.

గంగమ్మ ఆలయంలో చోరీ

వెండి ఆభరణాలు మాయం

చాగలమర్రి, సెప్టెంబరు 28: మండల పరిధిలోని చింతలచెరువు గ్రామంలో ఆదివారం రాత్రి గంగమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలో హుండీతో పాటు అమ్మవారికి అలంకరించే 14 వెండి గొడుగుల, వెండి వడ్డానం, కిరీటాన్ని చోరీ చేశారు. సుమారు రూ.52 వేల విలువ చేసే వెండి ఆభరణాలు మాయమయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ చిన్న పీరయ్య ఆలయానికి వెళ్లి పరిశీలించారు.


గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దుండగులు హుండీని చాగలమర్రి సమీపంలోని యాగంటయ్య పొలం వద్ద పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. క్లూస్‌ టీమ్‌ ఏఎస్‌ఐ కళావతి సిబ్బంతితో వచ్చి ఆలయంలో ఆధారాలను సేకరించారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-09-29T10:55:37+05:30 IST