Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇలా చేస్తే మోకీళ్ల నొప్పులు మాయం!

ఆంధ్రజ్యోతి(30-11-2021)

మోకాలి నొప్పులుంటే యోగాసనాలు వేయకూడదు అనేది అపోహ. మోకీళ్ల నొప్పులతో వేయదగిన, వేయవలసిన ఆసనాలు ఉన్నాయి. వాటితో నొప్పులు తగ్గడంతో పాటు, కీళ్ల కదలికలు మెరుగవుతాయి.


వీరాసనం

ఇలా వేయాలి: అరికాళ్లు పిరుదులకు ఆనేలా మోకాళ్లను లోపలికి మడిచి నేల మీద కూర్చోవాలి. రెండు అర చేతులను మోకాళ్ల మీద ఉంచాలి. ఈ ఆసనంలో 30 - 60 సెకన్ల పాటు ఉండాలి.


ప్రయోజనం: దీర్ఘ సమయాల పాటు ఒకే ప్రదేశంలో కూర్చుని పని చేయడం వల్ల కీళ్లు బిగుతుగా మారతాయి. వీరాసనం వల్ల కటి ప్రదేశం, మోకీళ్లు వదులై కదలికలు తేలికవుతాయి. ఫలితంగా నొప్పి అదుపులోకి వస్తుంది. 


త్రికోణాసనం

ఇలా వేయాలి: కాళ్ల మధ్య 3 అడుగుల దూరం ఉండేలా నిలబడాలి. కుడి పాదం కుడి పక్కకు తిప్పాలి. నడుము కదల్చకుండా, నడుము పైభాగాన్ని కుడి వైపుకు వంచి, కుడి చేతిని కుడి పాదం దగ్గర నేలకు ఆనించాలి. ఇలా చేస్తున్నప్పుడే, ఎడమ చేతిని నిటారుగా గాల్లోకి లేపి ఉంచాలి. ముఖాన్ని పైకి లేపిన చేతి వైపు తిప్పాలి. ఇదే విధంగా ఎడమ వైపు కూడా చేయాలి.


ప్రయోజనం: మెకాలిలోని టెండాన్లు, కండరాలు, లిగమెంట్లు సాగి, కీలుకు అదనపు ఆసరా అందిస్తాయి. దాంతో మోకాళ్ల నొప్పులు అదుపులోకొస్తాయి. 

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...