Advertisement
Advertisement
Abn logo
Advertisement

మోకాలి నొప్పి తగ్గేదెలా..

ఆంధ్రజ్యోతి(10-08-2021)

మోకాళ్ల నొప్పులంటే ఒకప్పుడు యాభై ఏళ్లు పైబడిన వారికి వచ్చేవి. ఇప్పుడలా కాదు.. తినే ఆహారం, తాగే నీరు లాంటి కారణాలతో ఈ సమస్య వస్తోంది. మోకాళ్ల నొప్పులనుంచి కాస్త ఉపశమనం పొందాలంటే చేయండిలా.. 


మోకాలి నొప్పి ఉండేచోట ఐస్‌క్యూబ్స్‌తో పదిహేను నిమిషాలు రుద్దితే రక్తప్రసరణ జరిగి నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది.


యోగా శిక్షకుడి సమక్షంలో కాళ్లనొప్పులు తగ్గేందుకు యోగా చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేయటం వల్ల మోకాళ్ల నొప్పిని కాస్త తగ్గించే అవకాశం ఉంటుంది. 


ఉదయాన్నే సూర్యకాంతిలో కూర్చొని ఆవాల నూనెతో మోకాలిని మర్ధన చేస్తే సమస్య తగ్గిపోతుంది.


నిపుణుడి సమక్షంలో స్ర్టెచ్‌ ఎక్సర్‌సైజ్‌లు చేయడం మంచిది. 


మీరు వేసుకునే చెప్పులు, షూల వల్ల కూడా మోకాళ్ల నొప్పులు కలగొచ్చనే విషయం ఆలోచించాలి. మోకాళ్ల నొప్పి తీవ్రంగా ఉంటే ఆక్యుప్రెషర్‌ థెరపీని ప్రయత్నించొచ్చు. కాళ్లకు మరీ శ్రమ కలిగించకుండా విశ్రాంతి తీసుకోవడమూ ఉత్తమమే. 


మంచి నీటిని ఎక్కువగా తాగాలి. దీంతో పాటు ఖచ్చితమైన డైట్‌ పాటించాలి. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను, ఫ్రైడ్‌ ఫుడ్‌కు దూరంగా ఉండండి. పొటాషియం కోసం బ్రొకోలీ, స్వీట్‌ పొటోటాలు తీసుకోవాలి. గింజలు, చేప, సోయాబీన్స్‌ తింటే మెగ్నీషియం అందులో ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం ఉండే ఆహారపదార్థాలు తీసుకుంటే మోకాలి నొప్పినుంచి ఉపశమనం పొందొచ్చు.

Advertisement

Health Latest newsమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...